అక్రమాలను బయట పెడుతూనే ఉంటా

– హరీశ్‌రావుకు ఎంపీ అనిల్‌కుమార్‌ ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘నువ్వు నాకు ఎన్ని లీగల్‌ నోటీసులు పంపినా… పదేండ్లలో నువ్వు చేసిన అక్రమాలను బయటపెడుతూనే ఉంటా’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు పక్కనే ఉన్న విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌ అక్రమాల చిట్టా ఇదిగో అని పేర్కొన్నారు. రంగానాయక సాగర్‌ ప్రాజెక్టు కోసం సర్వే నంబర్‌ 402లో హరీశ్‌రావుకు గెస్ట్‌ హౌస్‌ ఉన్న 2.36 ఎకరాల ప్రాంతాన్ని భూసేకరణ నుంచి ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు మినహాయించిందని ప్రశ్నించారు. అదే సర్వే నంబర్‌ 402లో సామాన్య రైతులకు చెందిన 2.08 ఎకరాల భూములను మాత్రమే ఎందుకు సేకరించిందని నిలదీశారు. ఆ భూమిని, భూసేకరణ నుంచి మంత్రి స్థానంలో ఉండి మినహాయించలేదా? అని ప్రశ్నించారు.