మల్లాపూర్ ప్రత్యేక అధికారిగా ఇరిగేషన్ ఏఈ రవీందర్ రెడ్డి

– సన్మానించిన మాజీ సర్పంచ్ చిర్ర సాయిలు
నవతెలంగాణ – కొత్తూరు
మల్లాపూర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా నీటిపారుదలశాఖ ఏఈ రవీందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. బుధవారం అయిన మల్లాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తన బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ లు బాల్ శివ రెడ్డి, రంగారెడ్డి,  మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బలవంత్ రెడ్డి, సోషల్ మీడియా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి,  మాజీ వార్డ్ సభ్యులు  కిషోర్ గౌడ్,  శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రమేష్, పంచాయతీ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు.