గ్రామ చెరువులకు సాగునీటి సౌకర్యం కల్పించాలి..

– పిఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి.
నవతెలంగాణ-తొగుట
గ్రామానికి సాగునీటి అందేలా కృషి చేయాలని కాన్గల్ పిఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి కోరారు.శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే గా గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డిని మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన నాయకులు,కార్య కర్తలతో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన రెండు చెరువుల కు సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరామని తెలిపారు.చెరువులకు సాగునీరు అందిస్తే రైతాంగా నికి వరి పంట సాగు చేసేందుకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.నీటి సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తే రైతులు ఆర్థిక అభివృద్ధి సాదించేందుకు తోడ్పాటు అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేం దుకు కృషి చేస్తానని చెప్పారు.ఆయా సమస్యలు పరిష్కరించి నియోజకవర్గ అభివృద్ధికి ముందుం టానని హామీ ఇచ్చారని అన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ గంగని గళ్ళ మల్లయ్య,మార్కెట్ కమి టీ డైరెక్టర్ బాల్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ దూలం బైరా గౌడ్,మాజీ సర్పంచ్ మర్పల్లి రమేష్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పులి రాజు, సీనియర్ నాయకులు గురువా రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.