– కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేల లంచం
నవతెలంగాణ- పెద్దపల్లి టౌన్
పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్పీ నీటిపారుదల శాఖలో సహాయక ఇంజినీర్‌గా పని చేస్తున్న నర్సింగరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా, విసుగు చెందిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు చెప్పిన ప్లాన్ ప్రకారం.. సోమవారం కాంట్రాక్టర్ ఆ అధికారికి లంచం ఇవ్వడానికి వెళ్లాడు. నడిరోడ్డుపై కాంట్రాక్టర్ నుంచి నర్సింగరావు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నర్సింగరావును నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.