పాలమాకుల చెరువు రోడ్డును పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు

– ఫిర్యాదు చేసిన చిలకమర్రి నరసింహ పై కొంతమంది దౌర్జన్యం
– భయపడే ప్రసక్తే లేదు:  చిలకమర్రి నరసింహ
– పాలమాకుల చెరువు ఆక్రమణలపై ఆరా
– పరిశీలించి చర్యలు తీసుకుంటాం: అధికారులు
నవతెలంగాణ-శంషాబాద్‌
బ్లాక్‌ చేసిన రోడ్డును పునరుద్ధరించాలని, పాలమాకుల మైసమ్మ చెరువు ఆక్రమణలను తొల గించాలని పోరాటం చేస్తుంటే కొంతమంది స్వార్థ పరులకు మద్దతు పలుకుతూ తనపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతుల గురి చేస్తే భయపడే ప్రసక్తి లేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ మెంబర్‌ చిలక మర్రి నరసింహ అన్నారు. బ్లాక్‌ అయిన ముచ్చిం తల్‌- పాలమాకుల గ్రామాల అనుసంధానంగా ఉన్న బీటీి రోడ్డును సోమవారం ఇరిగేషన్‌ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ రెండు గ్రామాల మధ్య తరాల నుంచి ఉన్న రోడ్డును కొంతమంది తమస్వార్థం కోసం బ్లాక్‌ చేయించారు. 2015 సం వత్సరంలో ఆ మెటల్‌ రోడ్డును బీటి రోడ్డుగా మా ర్చందుకు అప్పటి ప్రభుత్వం రూ.1.49 కోట్ల మం జూరు చేసింది. అప్పటి మంత్రి పి. మహేందర్‌ రెడ్డి పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులు ముందుకు సాగకపోగా నిధులు దారిమళ్ళించి కొం తమంది వ్యక్తులు రోడ్డును బ్లాక్‌ చేయించారు. ఈ విషయంపై వారంరోజుల క్రితం ముచ్చింతల్‌ గ్రా మానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమి షన్‌ మాజీ మెంబర్‌ చిలకమర్రి నరసింహ పరిస్థి తిని చూసిచలించి మీడియా సమక్షంలో వివరిం చారు. ఈ అంశంపై మీడియాలో కథనాలు వచ్చా యి. అనంతరం సంబంధిత రెవెన్యూ ఇరిగేషన్‌ ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్‌ శాఖ డి ఈఈ దుద్యానాయక్‌ , ఇరిగేషన్‌ అధికారి మౌని క వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజీవ పాలమాకుల- ముచిం తల్‌ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు ఎలా ఆక్రమణకు గురైందనే అంశంపై చిల కమర్రి నరసింహ అధికారులకు వివరించారు. ఎవరు దాన్ని ఆక్రమించారు అనే అంశంపై మీడి యాకు తెలిపారు. ఈ రోడ్డు చెరువు పరిశీలించిన అదికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసు కుం టామని మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు.
చిలకమ్మరి నరసింహ పై బహుముఖ దాడి
పాలమాకుల-ముచ్చింతల గ్రామాలకు అను సంధానంగా ఉన్న రోడ్డు ఓ సంస్థ వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటే అది తప్పంటూ అధికారులకు మీడియాకు తెలియజేయడంతో కొం తమంది గ్రామంలోని వ్యక్తులు జీర్ణించుకోలే కపో యారు. ప్రజలందరూ చిలకమ్మరి నరసింహ చేసి న విషయాన్ని అభినందిస్తుంటే కొంతమంది ఆ సంస్థ తొత్తులుగా స్వార్థ శక్తులుగా మరి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చిలకమర్రి నరసిం హ పై దుర్భాషలకు దిగారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామంటే కావాలనే రాద్ధాంతం చేస్తున్నాడని ఆరోపించి దుర్భాషలా డారు. ఆ రోడ్డుతో ఆయనకు ఏమిటి సంబంధం అంటూ బండ బూతులు తిట్టారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ హెచ్చరించారు.
చిలకమర్రి నరసింహ మాట్లాడుతూ గ్రామ ప్రజల ప్రయోజనార్థం తాను రోడ్డు, చెరువులో జరుగుతున్న అక్రమాలను గురించి బయట పెట్టానని అన్నారు. గ్రామస్తులంతా ఈ రోడ్డు కా వాలని చాలా ఏళ్లుగా అడుగుతున్నారని తెలి పా రు. అయితే కొంతమంది తనపై బురద జల్లి వ్యక్తి గతంగా అవమానించే ప్రయత్నం చేసినా ఏ మా త్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. చెరువు ఎలా ఆక్ర మణలకు గురైందో రోడ్డు బ్లాక్‌ చేసిన విషయంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ చిలకమర్రి నర సింహ చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కొంతమంది స్వార్థంతో రెచ్చి పోయి భయపెట్టిస్తే భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. వెంటనే అధికా రులు జోక్యం చేసుకొని రోడ్డు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.