రాష్ట్రంలో నీటిపారుదల రంగం వివరాలు
– తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతదేశంలోనే ప్రాముఖ్యతను కలిగి ఉన్న 2 ముఖ్య నదులయిన గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉంది.
నీటిపారుదల ప్రాజెక్టుల వర్గీకరణ
– నీటిపారుదల ప్రాజెక్టులను ఆయా ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టు ప్రాంత పరిమాణం ఆధారంగా వర్గీకరిస్తారు.
– రాష్ట్రంలో ఉన్న మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులను కింది విధంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి:
1) భారీ ప్రాజెక్టులు : 25000 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు గలవి (లేదా >10,000 హెక్టార్లు)
2) మధ్యతరహా ప్రాజెక్టులు : 5000 ఎకరాల కంటే ఎక్కువ మరియు 25,000 ఎకరాలకు తక్కువ ఆయకట్టు కలవి (2000-10,000 హెక్టార్లు)
భారీ నీటి పారుదల ప్రాజెక్టులు
– నదీ జలాలను వినియోగించుకోవడం కోసం ప్రభుత్వం 36 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. వీటిలో 21 భారీ సాగునీటి ప్రాజెక్టులు, 12 మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు.
– ఈ సాగునీటి ప్రాజెక్టులతో 72 లక్షల ఎకరాల సాగునీటి సామర్థ్యం కల్పించాలని నిర్ణయించడం జరిగింది
తెలంగాణలో పూర్తి అయిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు:
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
– నాగార్జున సాగర్‌కి మరొక పేరు నందికొండ ప్రాజెక్ట్
– నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తైన రాతికట్టడం, ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు.
– ఇది ఒక బహుళార్ధసాధక ప్రాజెక్ట్ (408 టి.ఎమ్.సి), స్థాపిత విద్యుత్ సామర్థ్యం 816 మె.వా.
– నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద భోస్లా కమిటి సూచనల మేరకు 1956 డిసెంబర్ 10న శంఖుస్థాపన చేశారు. 1967 అగస్టు 4న ఈ ప్రాజెక్టును ఇందిరాగాంధీ ప్రారంభించారు.
– ఈ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతం 216 లక్షల చ.కి.మీ. (ద్యాం పొడవు 1550 మీ. 124 మీ. ఎత్తు)
– ఈ నాగార్జున సాగర్ డ్యాం వలన నాగార్జున కొండ చుట్టూ కృత్రిమ సరస్సు ఏర్పడినది. ఇక్కడ ద్వీపంలో మ్యూజియం కలదు.
– ఈ రిజర్వాయర్ గట్టుపై ప్రాచీన బౌద్ధవాసాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం, బౌద్ధ స్థూపాలు, విహారాలు, బిలిపీఠం కలవు.
– ఈ ప్రాజెక్టు వలన 10లక్షల ఎకరాలకు పైగా సాగవుతుంది.
– ఈ ప్రాజెక్టు నిర్మాణ ఇంజినీర్- కె. ఎల్. రావ్. దీని మొదటి చీఫ్ ఇంజినీర్- జాఫర్ అలీ
ఆయకట్టు:
1) కుడి ప్రధాన కాలువ (జవహర్ కాలువ) – 10 నుండి 11 లక్షల ఎకరాలు (గుంటూరు, ప్రకాశం),
2) ఎడమ ప్రధాన కాలువ (లాల్ బహదూర్ కాలువ) – 8.5 నుండి 9.6 లక్షల ఎకరాలు (నల్గొండ, ఖమ్మం, ప్రకాశం)
మూసీ ప్రాజెక్టు
– కేతేపల్లి మండలంలో మూసీనదిపై 1954లో ప్రారంభించి 1961లో పూర్తిచేశారు. ప్రధాన కాలువ 64కిలోమీటర్ల పొడువు ఉంది.
– టేకుమట్ల వంతెన వరకు ప్రవహిస్తుంది. కుడి కాల్వ 31కి.మీ. ఎడమ కాలున 34కి.మీ. సాగి 61 గ్రామాలలోని పొలాలకు నీరందిస్తుంది. దాదాపు 30 వేల ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి.
ఆలీ సాగర్ ఎత్తిపోతల పథకం
– జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం ఆలీ సాగర్.
– నిజామాబాద్ జిల్లాలో ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పథకం.
– గోదావరి నదిపై ఉన్న శ్రీరామసాగర్ ప్రాజెక్టు నీటిని (720 క్యూసెక్కులు) ఎత్తిపోతల ద్వారా తరలించడం.
– ఈ ప్రాజెక్టు ఆయకట్టు 53,793 ఎకరాలు.
– లబ్ధి పొందే మండలాలు ఆరు. 1) నవీపేట్ 2) రేంజల్ 3) యెడపల్లి 4) నిజామాబాద్ 5) బీచ్‌పల్లి 6) మాక్లూర్.
– నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లి గ్రామం వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ నిర్మించారు. రెండో పంప్ హౌస్ రెంజల్ మండలం తాడ్‌బిలోలిలో, మూడో పంప్ హౌస్ ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లో నిర్మించారు.
– జాన్కంపేట్ నుంచి ఎత్తిపోతల నీటిని కాల్వల ద్వారా తీసుకువచ్చి నిజాంసాగర్ ప్రధాన కాలువలో కలిపారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు:
– నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు వద్ద గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌ను నిర్మించారు. స్థానికంగా శ్రీ కోదండరామ స్వామి ఆలయం ఉండడంతో ఈ ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌గా పేరు పొందింది.
– ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా జీవనాధారమైంది.
– నిజామాబాద్ జిల్లాలోని నందిపేట, ఆర్మూర్, నవీపేట, బాల్కొండ మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావల్‌పూర్, నిర్మల్ మండలాల్లో పలు గ్రామాల ప్రజలు సర్వస్వం త్యాగం చేయగా రూపుదాల్సిన ఈ ప్రాజెక్టుకు 1963లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించారు.
– 1978లో నిర్మాణం పూర్తయి అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. మొత్తం 18 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఖరీఫ్‌కు 9.5 లక్షల ఎకరాలు, రబీలో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తోంది. దీని యొక్క కాలువలు కాకతీయ, సరస్వతీ, లక్ష్మి,
అర్గుల రాజారాం ఎత్తిపోతల పథకం (గుత్ప)
– గోదావరి నది పైన శ్రీరామసాగర్ నీటి ద్వారా ఆయకట్టు స్థిరీకరణ.
– ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 38,792 ఎకరాలు.
– నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై మొదటి పంప్ హౌస్ నిర్మాణం జరిగింది.
– రెండో పంప్ హౌసు మోర్తాండ్ మండలం ధర్మోరం గ్రామం వద్ద నిర్మించారు.
– జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన రెండో పథకం గుత్ప ఎత్తిపోతల పథకం.
నిజాం సాగర్
– కామారెడ్డి జిల్లా, అచ్చంపేట వద్ద మంజీర నదిపై నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మితమైంది. 1923లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేతృత్వంలో బంజపల్లి వద్ద పరిసర 40 గ్రామాలను ఖాళీ చేసి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టును 29.72 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించారు. కాని 1972లో నిర్వహించిన హైడ్రోలాజికల్ సర్వే ప్రకారం ఈ రిజర్వాయర్ సామర్థ్యం కేవలం 11.79 టిఎంసీలు మాత్రమే. వాస్తవంగా 17.91 టీఎంసీల మేర మేట పేరుకుపోయింది.
– దీని యొక్క కాలువలు రెండు. అవి: 1) మహబూబ్‌నగర్ కుడికాలువ 2) ఫతేనహర్ ఎడమ కాలువ
– లబ్దిపొందే మండలాలు – నిజాంసాగర్, కోట్‌గిరి, ఎడ్‌పల్లి, మక్లూర్, జాక్రీన్‌పల్లి, బాన్సువాడ, వర్సి, నిజామాబాద్, పెంజల్, వెల్పూర్, బిరకూర్, బోధన్, డిచ్‌పల్లి, నందిపేట, బాల్కొండ (నిజామాబాద్ జిల్లా)
– మంజీర నది వద్ద సింగూరు మిగులు జలాలను ఆధారంగా చేసుకొని ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. మూడు కిలోమీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట నిర్మించారు.
– నవాబ్ అలీ సహజంగ్ బహదూర్ పర్యవేక్షణలో 1931లో నిర్మాణం పూర్తయింది.
– 2.75 లక్షల ఎకరాలకు నీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం 2,31 లక్షల ఎకరాలకు అందించగలుగుతోంది. నిజాం పాలనలో కట్టించినందుకు ఈ ప్రాజెక్టును నిజాం సాగర్‌గా నామకరణం చేశారు.
– ప్రాజెక్టులో బోటింగ్ సౌకర్యంతోబాటు పర్యాటకులను అలరించే ఆహ్లాదకరమైన సుందరమైన వనం ఉంది.
జూరాల ప్రాజెక్టు
– కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు.
– ఈ ప్రాజెక్టును 11.94 టిఎంసీల సామర్థ్యంతో 1984లో నిర్మించారు.
– ఈ ప్రాజెక్టు ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రేవులపల్లి గ్రామం వద్ద కలదు.
– ఈ ప్రాజెక్టు పూర్తి పేరు – ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.
– ఈ ప్రాజెక్టు ద్వారా 221.40 ఎమ్.డబ్ల్యు. జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
– ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 1.02 లక్షల హెక్టార్లు.
– ఈ ప్రాజెక్టు ద్వారా (ఎన్.టి.ఆర్. కాలువ) ఎడమ కాలువ కింద 26,103 హెక్టార్లు (నల్ల సోమాద్రి కాలువ) కుడి కాలువ క్రింద 15,257 హెక్టార్లకు నీటి పారుదల అవసరాలను తీరుస్తుంది. (41,360 హెక్టార్లు)
– దేశంలోనే అత్యధిక బ్లాకులు ఉన్న ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (బ్లాకులు – 84).
రాజోలి బండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)
– ఈ ప్రాజెక్టు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు.
– ఈ ప్రాజెక్టును తుంగభద్ర నదిపై కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మన్ని తాలుకాలోని రాజోలిబండ గ్రామం వద్ద నిర్మించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 87,500 ఎకరాలకు నీటిని అందించడం జరుగుతుంది.
– ఈ ప్రాజెక్టు నిర్మాణం నిజాంల పాలన కాలంలో క్రీ.శ. 1946లో ప్రారంభించగా 1958లో పూర్తి అయినది.
– ఈ ప్రాజెక్టులు నీటిని 143 కి.మీ.లు ఆర్‌డిఎస్ కాలువ ద్వారా గద్వాల మండలంలోని 8 గ్రామాలకు, అలంపూర్ మండలంలోని 67 గ్రామాలకు అందించడం జరుగుతుంది.
కడెం రిజర్వాయర్
– నిర్మల్ జిల్లాలోని కడెం మండలం పెద్దూర్ గ్రామ సమీపంలో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్ట్ నీటి వినియోగం – 13.243 టీ.ఎమ్.సి
– లబ్ది పొందె మండలాలు- కడెం, జన్నారం, దండెపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల.
లోయర్ మానేర్ రిజర్వాయర్
– కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఉపనది అయిన మానేర్ నదిపైన ఈ జలాశయాన్ని నిర్మించారు. 1985లో ఇది పూర్తయింది. దాదాపు 27 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆనకట్ట అనందాన్ని ఇవ్వడమే కాకుండా కరీంనగర్ వాసులకు ట్యాంక్‌బండ్ అనుభూతి కలుగుతుంది.
సింగూరు ప్రాజెక్టు
హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలకు త్రాగు నీరు అందించడం కోసం మంజీర నదిపై సింగూర్ ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా, కుల్కర్ మండలం, సింగూర్ గ్రామం వద్ద నిర్మించారు.
– ఇది బహుళార్ధ సాధక ప్రాజెక్టు (30 టిఎంసీలు)
– ఈ ప్రాజెక్టు ఆయకట్టు – 40,000 ఎకరాలు. (2 టిఎంసీల నీటిని సంగారెడ్డి, ఆందోల్‌లకు పంపిణి చేస్తారు)
– ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి 15 మెగావాట్లు.
– సింగూర్ ప్రాజెక్టుకు మరొక పేరు – మొగిలిగుండ్ల బాగా రెడ్డి సింగూర్ ప్రాజెక్టు.
తెలంగాణలోని భారీనీటి పారుదల ప్రాజెక్టుల వివరాలు
తెలంగాణలోని భారీ ప్రాజెక్టులు
1. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు
2. నిజామ్‌సాగర్ ప్రాజెక్టు
3. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు- స్టేజ్-1
4. అలీసాగర్ ఎత్తిపోతల పథకం
5. అరుగుల రాజారాం-గుత్ప ఎత్తిపోతల పథకం
6. లోయర్ మానేరు డ్యామ్
7. ఎం. బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు
8. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్
9. మూసి ప్రాజెక్టు
10. మైలారం బాలెన్సింగ్ రిజర్వాయర్
11. బయ్యన్నవాగు బాలెన్సింగ్ రిజర్వాయర్
12. ప్రియదర్శిని (జూరాల) ప్రాజెక్టు
13. రాజోలి బండ డైవర్షన్ స్కీం
నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు
14. ప్రాణహిత-చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
15. FFC From SRSP
16. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
17. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్
18. మధ్య మానేరు జలాశయం
19. బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు కాలువలు
20. JCR GLIS
21. ఇందిరా సాగర్-రుద్రం కోట
22. రాజీవ్ సాగర్-దమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్
23. దమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్పాండ్
24. ఏఎంఆర్ ప్రాజెక్టు(SLSBC)సొరంగమార్గం సహా)
25. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం
26. మహాత్మగాంధీ-కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
27. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
28. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం
29. సిని నరసింహరావు -కంతాలపల్లి సుజల స్రవంతి
30. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్-11
భారీ ప్రాజెక్టులు
ప్రణాళిక దశలో ఉన్నవి
31. దిగువ పెన్‌గంగ ప్రాజెక్టు
32. ఇచంపల్లి ప్రాజెక్టు
33.మున్నేరు రిజర్వాయర్
34. డిండి ఎత్తిపోతల పథకం
35. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
36. కాళేశ్వరం ప్రాజెక్టు
తెలంగాణలోని మధ్యతరహా
నీటిపారుదల ప్రాజెక్టుల వివరాలు
1.స్వర్ణ ప్రాజెక్టు
2. వట్టివాగు ప్రాజెక్టు
3. సత్నాల ప్రాజెక్టు
4. చెల్మెలవాగు (ఎన్టీఆర్ సాగర్)
5. పిపి రావు ప్రాజెక్టు (ఎర్రవాగు)
6. గడ్డెన్న – సుద్దవాగు ప్రాజెక్టు
7. ఖానాపూర్ కాలువ (సదర్మత్)
8. రాలీవాగు ప్రాజెక్టు
9. మత్తడి వాగు ప్రాజెక్టు
10. పోచారం ప్రాజెక్టు
11. రామడుగు ప్రాజెక్టు
12. కౌలాస్ నాలా ప్రాజెక్టు
13. శనిగరం ప్రాజెక్టు
14. బొగ్గులవాగు ప్రాజెక్టు
15. ఎగువ మానేరు ప్రాజెక్టు
16. నల్లవాగు ప్రాజెక్టు
17. ఘన్పూర్ ఆనకట్ట
18. రామప్ప చెరువు
19. మల్లూరువాగు ప్రాజెక్టు
20. పాకాల చెరువు
21. చలివాగు ప్రాజెక్టు
22. లక్నవరం ప్రాజెక్టు
23. వైరా ప్రాజెక్టు
24. లంకా సాగర్ ప్రాజెక్టు
25. పెద్దవాగు ప్రాజెక్టు
26. బయ్యారం ప్రాజెక్టు
27. తాళి పేరు ప్రాజెక్టు
28. గుండ్లవాగు ప్రాజెక్టు
29. పాలేరు ప్రాజెక్టు
30. కోటిపల్లి ప్రాజెక్టు
31. జుట్‌పల్లి ప్రాజెక్టు
32. లక్నపూర్ ప్రాజెక్టు
33. దిండి ప్రాజెక్టు
34. ఆసిఫ్ నహర్ ప్రాజెక్టు
35. ఉత్కూర్ మారేపల్లి ప్రాజెక్టు
36. సరళ సాగర్ ప్రాజెక్టు
37. కోయిల్ సాగర్ ప్రాజెక్టు
మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు – నిర్మాణ దశలో ఉన్నవి
38. పెద్దవాగు ప్రాజెక్టు (కోమ్రంభీం)
39. పెద్దవాగు ప్రాజెక్టు (జగన్నాధపూర్)
40. గొల్లవాగు ప్రాజెక్టు
41. పెద్దవాగు ప్రాజెక్టు (నీల్వాయి)
42. చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం
43. లెండి
44. మోడికుంటవాగు ప్రాజెక్టు
45. పాలెంవాగు ప్రాజెక్టు
46. కిన్నెరసాని డ్యామ్ కాలువ