
నవతెలంగాణ-గంగాధర : ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపూర్, గంగాధర మిని జలాశయాలు నింపి చొప్పదండి నియెాజక వర్గంలోని మెట్ట ప్రాంతంలోని చివరి మడి వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు కట్ట మరమ్మత్తు పనుల ఎమ్మెల్యే సత్యం పరిశీలించారు. యాసంగి పంటల సాగుకు కాళేశ్వరం జలాలను అందించి రైతాంగం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నీటిపారుదలశాఖ అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసి, పంటలకు సాగునీరు అందించే ఏర్పాటు వేగవంతం చేయాలని సూచించారు. ఎల్లమ్మ చెరువు కట్ట తెగి రెండేళ్లు గడుస్తున్న గత ప్రభుత్వం హయాంలో కట్టకు మరమ్మత్తులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో రైతులు నాలుగు పంటలు నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కట్ట మరమ్మత్తు పనులను వేగవంతం చేశామని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, సెంటు భూమి కూడా ఎండిపోకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ అశోక్ కుమార్, ఈఈ శ్రీనివాస్ గుప్తా, డీఈ శ్రీనివాస్, కొండగట్టు ఆలయ ధర్మకర్త పుల్కం నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, మండల నాయకులు దుబ్బాసి బుచ్చయ్య, తోట మల్లారెడ్డి , తిరుపతి రెడ్డి,పడాల రాజన్న, తోట సంధ్య, కరుణాకర్, రామిడి రాజిరెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తాళ్ళ అంజయ్య, వేముల భాస్కర్, యగ్నేష్
పాల్గొన్నారు.