‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ ప్రభుత్వం, తన పదేళ్ళ పాలనా కాలం లోసాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.కేంద్ర మంత్రులు ఈ దిశగా తమ ప్రయత్నాలను ప్రారంభించారు.మన దేశ జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)7శాతం వృద్ధి రేటుతో ప్రగతి పథంలో దూసుకుపోతుంది అని అంటుంన్నారు. అంతేకాక 2047 నాటికి గ్లోబల్ ఆర్ధిక వ్యవస్థలో 3వ, ఆర్ధిక శక్తిగా ఎదుగుతుం దని ఆశాభావాన్ని భారత ప్రధాని మోడీజీ ఇటీవల వ్యక్తం చేశారు కూడా. ఇది సంతోషించదగిన విషయం. అయితే,ఈ ప్రకటనను కేవలం ఊహలు అభిలాషల పరంగా కాకుండా వాస్తవిక గణాంకాల ఆధారంగా పరిశీలించటం అవసరం.
సాధారణంగా జీడీపీ వృద్ధి రేటు ఏ మేరకు పెరిగిందో చూ డాలంటే అంతకు ముందు సంవత్సరపుతో పోల్చి ప్రస్తు త జీడీపీ ఎంతపెరిగిందో ప్రకటిస్తారు.కానీ, మన ప్ర భుత్వం 2021లో కోవిడ్ సందర్భంగా మన జీడీపీ మైనస్ 5.8 శాతం మాత్రమే నమోదయింది. దీనితో పోల్చి 2022-2023లలో జీడీపీ వృద్ధిరేటు 7 శాతా నికి పైగా వృద్ధి చేరిందనట్లుగా ప్రభుత్వం లెక్కలు కట్టింది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే 2004-14 సం వత్సరాల మధ్య పదేళ్ల కాలంలో జీడీపీ వృద్ధిరేటు సగటున 8.1శాతంగా ఉండింది. అదే పదేళ్ళ కాలంలో బీజేపీ ప్రభుత్వలో అది కేవలం 5.4 శాతం మాత్రమే ఉంది.ఒక వేళ బీజేపీ ప్రభుత్వం చెబుతున్నట్లు జీడీపీ ప్రగతి పథంలో ఉన్నట్లైతే ఆ అభివృద్ధి ఫలాలు సామాన్యు ప్రజల నిత్య జీవన విధానంలో ప్రతిబింభించాలి కదా! మరి వాస్తవంగా అలా ఉందా? నిష్పాక్షి కంగా పరిశీలన చేద్దాం.
ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలు పెరిగి పోతున్నాయని వెల్లడించింది. అలాగే ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ సంస్థ కూడా తన నివేదికలో గత దశాబ్ద కాలంలో దేశంలోని సంపన్నుల ఆదాయం పది రెట్లు పెరిగిందని స్పష్టంగా వెల్లడించింది. ప్ర స్తుతం వారి వార్షికాదాయం నేటి భారతదేశ బడ్జెట్ కంటే అధిక మని కూడా తెలిపింది. కేవల మన దేశ జనాభాలో ఒక్క శాతం గా ఉండే సంపన్న వర్గాలకే మొత్తం దేశ ఆదాయంలో సుమారు 73 శాతం పోతుందనీ, ఇక 67 కోట్ల మంది సామాన్యు ప్రజల ఆదాయం మాత్రం కేవం ఒక్క శాతమే పెరిగింది అని పేర్కొం ది. మరి దీన్ని ప్రగతి పథం అంటారా? బీజేపీ ఆర్ధిక నిపుణులు నిజాలు వెల్లడించాలి.
దేశంలో అనునిత్యం విద్యా, వైద్య, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి.ఖర్చులు భారమై కుటుంబాలు రుణభారంతో వొరిగిపోయాయి. వడ్డీలు చెల్లించలేక ఉన్న కొద్దిపాటి ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. దేశంలో ప్రతి ఏటా 6.3 కోట్ల మంది దారిద్రంలోకి నెట్టబడుతున్నారని ఈ సంస్థ స్పష్టంగా పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం చెబుతున్నట్లు దేశంలో జీడీపీ వృద్ధి రేటు బాగా ఉంటే ఉద్యోగ, ఉపాది అవకాశాలు పెరగాలి కదా! నిజానికి అలా పెరుగుతున్నాయా? మోడీజీ ప్రభుత్వ హామీ ప్రకారం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా మన్నారు. ఈ పాటికే ఈ పదేళ్ళలో 20కోట్ల ఉద్యో గాలు ఇచ్చి ఉండాలి. మరి ఇచ్చారా? లెక్కలు ఉన్నాయా? ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత రేటు 10 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నా యి. నిజానికి కొత్త కొలువులు రాక పోగా ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి.
ఇప్పటికే దేశ జనాభా కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలతో కునారిల్లుతుంది. దానికి తోడు ఈ ఆర్థిక అసమానతలు కూడా చేరడంతో భారత భవిష్యత్తు ఆందోళన కరంగా ఉందని జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రముఖ ప్రొఫెసర్. హిమాన్షు (జేఎన్‌యూ)ఇదే విషయాన్ని బలపరచారు. పోనీ ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగు పడ్డాయా? అంటే, అదీలేదు. పేదరికం పెద్ద ఎత్తున పెరుగుతోందని అంతర్జాతీయ సూచీలు వెల్లడిస్తు న్నాయి. మోడీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జన్‌ధన్ అకౌంట్లలో డబ్బులే లేవు. సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 74.1 శాతం భారతదేశ పౌరులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారని ఐక్య రాజ్యసమితికి చెందిన ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ తన నివేదికలో తెలిపింది. జీడీపీ వృద్ధిరేటు సాధించడంలో విశేష మైన పాత్ర పోషిస్తున్న కార్మికులు, రైతుల జీవన స్థితిగతులు ఏమైనా మెరుగుపడ్డాయా? అంటే అదీ లేదు. ప్రభుత్వ సంస్థ ల్లో కెల్లా అతి పెద్దదైన రైల్వేలతో సహా ఉద్యోగ నియామకాలను కేంద్ర ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఎటువంటి ఉద్యోగ భద్రత లేని, అత్యంత తక్కువ వేతనాలకు ఈ రోజున కార్మికులు పనిచేయవలసి వస్తోంది. కొత్తగా వస్తున్న కొద్దిపాటి ఉపాధి కూడా కాంట్రాక్టు, అసంఘటిత రంగాల నుండే వస్తుంది.వీరికి నెలకు పదిహేను వేలకు మించి ఆదాయం లేదు. మహిళాభి వృద్ధి, బేటీ పడావో అని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, మోడీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న సుమారు కోటి మందికి పైగా మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, వేతనాలు కూడా అత్యంత తక్కువ. అవి కూడా సకాలంలో విడుదల కావు. పేదలకు పోష కాహారం, మహిళా, శిశు సంరక్షణ వంటి ముఖ్యమైన అనేక సేవలందిస్తున్న ఈ స్కీం వర్కర్ల సమస్యలు చెప్పనలవికావు. చివరకు ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా వీరి సమస్యల పరిష్కారానికై ఆందోళన చేయవలసి వచ్చింది.
ఎన్డీఏ మొదటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానం ఉద్యోగుల పొదుపు సొమ్మును కొద్ధిమంది కార్పొరేట్లు దోచుకుపోయేలా తయారైంది. దీనిని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అనేక రాష్ట్రాల్లో ఉద్యోగు లు పెద్దఎత్తున పోరాడుతున్నారు.ఇది చాలదన్నట్లు కార్మికులకు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కొంతైనా మేలు చేసే 27 కార్మిక చట్టాలను మోది ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో సంఘం పెట్టుకోవడం, సమ్మె చేసే మౌలిక రాజ్యాంగ హక్కులను సైతం హరించే విధంగా కార్మిక వ్యతిరేక నిభం ధలతో నాలుగు లేబర్ కోడ్‌లను మోడీ ప్రభుత్వం తయారు చేసింది. అలాగే, మరోపక్క వ్యవసాయ రంగంలో పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది. కార్పొరేట్ సేద్యాన్ని ప్రోత్సహించేలా నల్ల చట్టాలను చేసింది. రైతులు ఎండలో, వానలో, చలిలో, ‘కోవిడ్’ విజంభణ కాలంంలో ఏడాదికి పైగా పెద్దఎత్తున వీధుల్లో పోరాటం చేసినందున వాటిని వెనక్కుతీసు కుంటున్నట్లు మోది పార్లమెంటులో ప్రకటించాడు. క్షమాప ణలు కూడా చెప్పాడు. కానీ, ఆచరణలో అవే కార్పొరేట్ అను కూల విధానాలనే కేంద్రప్రభుత్వం కొనసాగిస్తోంది.
మోడీ పాలనలో శ్రామిక మహిళలతో పాటు సాధారణ మహిళలు కూడా పెద్దఎత్తున వివక్షకు గురవుతున్నారు. ‘నేష నల్ క్రైమ్ బ్యూరో’ నివేదిక ప్రకారం గత ఏడాది దేశంలో 62,946 మంది బాలికలు కనిపించకుండా పోయారు. వీరిలో అత్యధికులు వేశ్యా గృహాల పాలయ్యారు. ఇవన్నీ అధికారికంగా నమోద్కెన లెక్కలు. వాస్తవంలో ఇంకా ఎక్కువగా ఉంటాయని అంచనా.ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్రంలోని సుందర్‌ఘర్ ప్రాంతంలో సర్వే నిర్వహించిన ‘ప్రగతి అనే స్వచ్ఛంద సంస్థ’ 70 గ్రామాలలో పదమూడు వేలమంది అమ్మాయిలు కనపడ లేదని తన సర్వే రిపోర్టులో తెలిపింది.
నేడు దేశం వికసిత భారత్ ఏమోగానీ అత్యధిక పేద,మధ్య తరగతి ప్రజానీకాన్ని అబివృద్ధి ఫలాల నుండి గెంటివేసే భారత్‌గా రూపాంతరం చెందుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2047 కల్లా భారతదేశం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతుంది. మోడీజీ అనుకూల మీడీయా సంస్థల ద్వారా, సోషల్ మీడియా అనుబంధ సంస్థల ద్వారా ఎన్ని అసత్యాలతో, అభూత కల్పనలతో ఎంత ఊదరగొట్టినా ప్రజలు తమ నిత్యజీవిత అనుభవాలే నిజమేంటో వారికి తెలుపుతు న్నాయి. మోడీజీ పదేళ్ళ పాలనలో అసమానతలు రెట్టింపుగా పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపో యాయి అన్నది ముమ్మాటికీ నిజం. మోడీ ప్రభుత్వం కొద్ది కాలం కులం, మతం వంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి కొంత కాలం పబ్బం గడుపుకో వచ్చునేమో గానీ, ఎల్లవేళలా అశేష ప్రజానీక నిత్య జీవిత అనుభవాన్ని మాయమాటలతో మోస పుచ్చలేరు. నిజం నిలకడపై తేలుతుంది.
– డా.కోలాహలం, రామ్ కిశోర్
9849328496