– బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గూర్చి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి..
నవతెలంగాణ-తొగుట
మండలానికి మూడున్నర కోట్ల రూపాయల అభి వృద్ధి నిధులు రావడం జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి మండి పడ్డారు. శుక్రవారం ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం మండలంలో దాదాపు రూ. 3.33 కోట్ల నిధులతో స్థానిక ఎంపీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో భూమి పూజ కార్యక్రమాలు చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కార్య క్రమంలో మండల నాయకులు అందరూ పాల్గొ న్నారని తెలిపారు. మండలానికి ఎంపీపీ ప్రోటో కాల్ పదవి అని, ఎంపీపీ భూమి పూజ చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘించడం ఎలా అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలల సమయంలోనే మండలానికి మూడున్నర కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు రావడం జీర్ణిం చుకోలేని బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్దాం తం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేసిన ఈనాటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మొత్తం ఆయన పద వీకాలంలో కూడా మూడు కోట్ల రూపాయల నిధు లు ఇవ్వలేదని, బీఆర్ఎస్ నాయకులకు చేతనైతే ఎమ్మెల్యే ద్వారా మరో మూడున్నర కోట్ల రూపాయ లు తెచ్చి మండలంలో అభివృద్ధి పనులు చేయాల ని సవాల్ విసిరారు. గత పది సంవత్సరాలు సిద్ది పేట నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ దుబ్బాక నియోజకవర్గానికి తీరని అన్యాయం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడడం విడ్డూ రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రజాస్వామ్య వాసనలే నచ్చని బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గూర్చి ప్రోటోకాల్ గురించి మాట్లా డడం హాస్యాస్పదమని అన్నారు. ఇకనైనా సోయి తెచ్చుకొని మండల అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్, మాజీ సర్పంచులు పాగాల కొండల్ రెడ్డి, బుర్ర అనిత నర్సింలు, కొంగరి నర్సింలు, ఐఎన్టియుసి నియోజక వర్గ అధ్యక్షుడు బాలమల్లు, కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనాకర్ రెడ్డి, జిల్లా నాయకులు పబ్బతి మల్లా రెడ్డి, యెన్నం భూపాల్ రెడ్డి, బుస నిరంజన్ రెడ్డి, మండల నాయ కులు ఉప్పలయ్య, మధు, ముక్కెర కనకయ్య, దుద్దేడ యాదగిరి, దయాకర్ రెడ్డి, జయబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు.