గెలుపు బాట పట్టేనా?

గెలుపు బాట పట్టేనా?– ఉత్తరాఖాండ్‌తో హైదరాబాద్‌ రంజీ పోరు
డెహ్రాడూన్‌ :
రంజీ ట్రోఫీ ఎలైట్‌ రీ ఎంట్రీలో పరాజయం చవిచూసిన హైదరాబాద్‌.. నేడు ఉత్తరాఖాండ్‌తో మ్యాచ్‌లోనైనా గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. హైదరాబాద్‌ బౌలర్లు మెరిసినా.. బ్యాటర్లు అంచనాలను అందుకోలేదు. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను స్వల్ప స్కోరుకు ఆలౌట్‌ చేసే అవకాశం చేజార్చుకుని ఓటమి కోరల్లో కూరుకుంది. తొలి మ్యాచ్‌లో ఉత్తరాఖాండ్‌ సైతం హిమాచల్‌ చేతిలో ఓటమి చెందింది. నేడు డెహ్రాడూన్‌ వేదికగా హైదరాబాద్‌ రంజీ ట్రోఫీలో రెండో మ్యాచ్‌ ఆడనుంది. రాహుల్‌ సింగ్‌, తన్మరు అగర్వాల్‌, రోహిత్‌ రాయుడు, తన్మరు అగర్వాల్‌, సివి మిలింద్‌ హైదరాబాద్‌కు కీలకం కానున్నారు.