వడ్లను తరలించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యమా..? అధికారుల పర్యవేక్షణా లోపమా..?

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల బాబు గౌడ్‌
నవతెలంగాణ-నెల్లికుదురు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసు కువస్తే కాంటాలు చేపట్టకుండా, కాంటలు చేపట్టిన ధాన్యం తరలించకుండా నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా..? లేక అధికారుల పర్యవేక్షణలో విఫలమా..? లేదా నిర్వాహకుల లోపమా..? అని రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెరుమల్ల బాబు గౌడ్‌ పిఎసిఎస్‌ మాజీ డైరెక్టర్‌ లింగయ్య నాయక్‌ ప్రశ్నించారు. బుధవారం మండలం లోని నైనాల స్టేజి వద్ద పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై దాన్యం బస్తాలతో రైతులు గంటపాటు నిరసన తెలిపి ధాన్యాన్ని తక్షణమే పాలించే కార్యక్రమాన్ని తీసుకోవాలని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు పండించిన వరి ధాన్యం బస్తాలు కాంటాలు జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ కాంటాలు నిర్వహించిన అట్టి బస్తాలను మిల్లర్లకు తరలింపు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నార ని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా అకాల వర్షాలు కురవడం వల్ల రైతులు అట్టి ధాన్యాన్ని తిప్పి మరల ఆరబోయడంలో ఎంతో ఇబ్బందు లకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులకు చాలా నష్టం ఇప్పటికే జరి గిందని అన్నారు. రైతులు మళ్లీ పంట పండించేందుకు కాలం వచ్చిందని ఈ రోహిణి కార్తెలు నారుబోసే రోజులు ఉన్నాయని ఇప్పటివరకు కూడా పండించిన దాన్యం తరలిం చకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. రైతుకు దాన్యం విషయం లో నష్టం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేం ద్రాలు ప్రారంభమై రోజులు గడిచినప్పటికీ ధాన్యాన్ని తరలించడంలో అటు ప్రభుత్వమా ఇటు అధికారుల లేదా నిర్వాహకుల లోపాల నిర్లక్ష్యమా..? రైతుల ఇబ్బంది పెట్టి పరిస్థితులు ఎందుకు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే రైతుల మంతా ఏకమై ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారం స్పందించి మండలంలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వారి ధాన్యాన్ని తక్షణమే తరలించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. మిల్లర్లలో కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరి ధాన్యం కేంద్రాల నుంచి తరలించ లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజా ప్రతి నిధులు దశాబ్ది ఉత్సవాలు అంటూ సభలు సమావేశాలకు తిరగడం తప్ప కొనుగోలు కేం ద్రాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో రైతులను ఇబ్బందుల పాలు పెట్టిన వారికి తగిన బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్‌ మాజీ డైరెక్టర్‌ లింగ్య నాయక్‌, యసం పెద్ద రమేష్‌, ఆకుల సోమయ్య, దేశి లాల్‌, శ్రీనివాస్‌, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.