
– కోళ్ళు సిద్దం చేసుకుంటున్న పందెం రాయుళ్ళు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజక వర్గం భౌగోళికంగా మూడు వైపులా ఆంధ్రా భూభాగం నెలకొని ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలు,ఆచారాలు,రాజకీయాలు సైతం ఈ ప్రాంతం లో ప్రభావితం చేస్తుంటాయి. వీటిలో ప్రస్తుతం కోళ్ళ పందేలు కు ఔత్సాహికులు, పందెం రాయుళ్ళు సన్నద్దం అవుతున్నారు. జనవరి నెల మొత్తం ఈ నియోజ వర్గంలోని అనేక వ్యవసాయ క్షేత్రాలు ఈ పందేలు తో కలకల్లాడుతాయి. జనవరి 1 న మండలంలోని ఓ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆద్వర్యంలో బిరి ఏర్పాటు చేయగా కాంగ్రెస్ లోని ఓ వర్గం పోలీస్ జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదు చేసారు.వారి ఆదేశాలు మేరకు స్థానిక పోలీస్ అధికారులు నివారించడానికి ప్రయత్నం చేయగా మరో గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధి వ్యవసాయ క్షేత్రంలో బిరి ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. ఈ కుక్కుట సమరానికి స్థానిక అధికార రాజకీయ అండ మెండుగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఈ సంప్రదాయం మనది కాదని నిర్ద్వందంగా పందేలను నిషేధించింది.ఆంధ్రా బోర్డర్ లో ఉన్న మన పందెం రాయుళ్ళు ఆంద్రా సరిహద్దుల్లో ఈ పందేలకు తరలి వెళ్ళేవారు. ప్రజలు మార్పు కోరుకున్నట్లు ప్రభుత్వాన్ని మార్చారు.ఈ సంప్రదాయాన్ని తిరిగి ఆహ్వానిస్తారు,అంచున ఉండి ఆస్వాదిస్తారో చూద్దాం.