– కేసీఆర్‌కు మధుయాష్కీగౌడ్ చురక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకోకుండా కేసీఆర్ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోనే బీఆర్‌ఎస్‌కు దిక్కులేదు. ఇక మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని నడిపిస్తానంటూ చెప్పిన కేసీఆర్ బోల్తాపడ్డారు’ అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ఓడిపోవడం వల్ల ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తోసిపు చ్చారు. పదేండ్లపాటు అధికార మదంతో ప్రజలను విస్మరించారని పేర్కొన్నారు. ఏనాడూ సామాన్యుల సమస్యలను వినలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలు బాధపడుతున్నారంటూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని తెలిపారు.