పిగ్మెంటేషన్‌ సమస్యా?

పిగ్మెంటేషన్‌ సమస్యా?రకరకాల కారణాల వల్ల చాలామందికి ముఖంపై పిగ్మెంటేషన్‌ వస్తుంటుంది. దానికి క్రీములు, ఇతర మందులు వాడే బదులు ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
బంగాళా దుంపతో..
ఒక బంగాళా దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. పిగ్మెంటేషన్‌ ఎక్కువ ఉన్న చోట ఈ మాస్కుని వేసుకుని అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే తొందరగా నయమవుతుంది.
నిమ్మరసం, తేనె..
రెండు టేబుల్‌ స్పూన్ల తేనెలో రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలిపి అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేయాలి. ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్‌ చేసినట్లుగా వేయండి. ఇరవైనిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌..
అర కప్పు యాపిల్‌ సైడార్‌ వెనిగర్‌ లో అర కప్పు నీరు కలపండి. పిగ్మెంటేషన్‌ ఉన్న చోట ఈ నీటిని పోయండి. నాలుగైదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు నెల రోజుల పాటూ చేయండి.
పసుపు, పాలు..
ఒక బౌల్‌లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి మెత్తటి పేస్ట్‌ లా చేయండి. పిగ్మెంటేషన్‌ ఉన్నచోట ఈ పేస్ట్‌ అప్లై చేసి ఐదునిమిషాలు గుండ్రంగా మసాజ్‌ చేయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. రోజూ స్నానానికి ముందు ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.