ఒక సినిమా చూసో, ఒక సంఘటన నుంచి స్ఫూర్తి పొందో, మనకు కావల్సిన వారు చెబితేనో, మనంతట మనం ఇష్టపడో ఒక పనిని ప్రారంభించి మొదట్లో తెగ హడావిడి చేస్తాం. మనం తలపెట్టిన పని వల్ల వచ్చే చిక్కుముడులు, సమస్యలను ఎదుర్కో లేక ఆ పనిని మధ్యలోనే వదిలేస్తాం. దాన్నే ఆరంభ శూరత్వం అంటారు. గత వారం రోజులుగా నెట్టిం ట్లోనే కాదు నలుగురు గుమిగూడిన చోట హైదరా బాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటక్షన్(హైడ్రా)పై రసవత్తర మైన చర్చ సాగుతోంది. వాదోపవాదాలు, వ్యంగాస్త్రాలు, పరస్పర విమర్శలు రక్తి కట్టిస్తున్నాయి. ఈ ట్రోలింగ్‌లు, చర్చలు, బెట్టింగులు కాసే వరకువెళ్లాయి. ఫలానా పార్టీ వారినే టార్గెట్ చేస్తున్నారని ఒకరంటే, లేదు లేదు అందరిపై కొరఢా ఝులిపి స్తున్నారని మరి కొందరూ, హైదరాబాద్‌లో ఆక్రమణలకు చెక్ పెట్టేం దుకేనని ఇంకొందరూ వాదులాడుకుంటు న్నారు. మనం తప్పటడుగు వేయనంత వరకు భయపడాల్సిన పనిలేదు. అదే సందర్భంలో తరతమ భేదాలు చూపిస్తే అభాసుపాలుకాక తప్పదు. మొత్తానికి తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా హాట్ టాపి గ్గా మారింది. చిన్నవాటి నుంచి మొదలుకుని పెద్ద పెద్ద భవంతుల వరకు దాదాపు 70 నిర్మాణాలను కూల్చే శారు. గతంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ లాంటి సంస్థలు అక్రమ నిర్మాణాలకు చిన్న చిన్న రంధ్రాలు చేసి వదిలిపెట్టేవారు. కాని నేడు పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. నగరంలోని చెరువులు, కుంటలను ఆక్ర మించి బంగళాలు, ఫాంహౌజ్‌లు కట్టినవారు మాత్రం హైడ్రా దెబ్బకు నిద్రలేని రాత్రులు గడుపు తున్నారు. ఇలాంటి మంచి పనులు చేసేట ప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయి. అలాంటి సంద ర్భంలో సహనం చాలా అవసరం. అది వ్యక్తుల కైనా, ప్రభు త్వానికైనా వర్తిస్తుంది. విమర్శలకు బెదిరిపోకుం డా సమాధానం చెప్పాలి. విసుగుచెందితే లక్ష్యాలు నీరు గారడమే గాకుండా అప్పటివరకు పడ్డ శ్రమంతా వృధా అదు తుంది. సమస్యలకు భయపడి మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలేస్తే నిజంగానే ఆరంభ శూరత్వమే అవుతుంది. హైడ్రా. కడవరకు నిలుస్తుం దా? మధ్యలోనే బిస్తర్ సర్దుకుంటుందా? వేచి చూడాలి.
-ఊరగొండ మల్లేశం