నేల మీది నక్షత్రమా..

The floor is yours A star..ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్‌ సాయి’. బ్రాండ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బార్సు అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్‌ సినిమాస్‌, స్మార్ట్‌ స్క్రీన్‌  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌ పై బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్‌ తిరుమలశెట్టి ఈ  చిత్రాన్ని రూపొం దించారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘నేల మీది నక్షత్రమా..’ అంటూ సాగే  లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ను శ్రీ వసంత్‌ ఆకట్టుకునేలా కంపోజ్‌ చేయగా, చంద్రబోస్‌ అందమైన సాహిత్యం అందించారు. అనుదీప్‌ దేవ్‌ మంచి ఫీల్‌తో పాడారు.  పోసాని కష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సమీర్‌, ఎస్‌ఎస్‌ కాంచి, భద్రం, కిర్రాక్‌ సీత, రీతు చౌదరి, ఫన్‌ బకెట్‌ రాజేశ్‌, రాజ ప్రజ్వల్‌ తదితరులు నటించిన ఈచిత్రానికి ఆర్ట్‌ –  లావణ్య వేములపల్లి, డీవోపీ – ప్రశాంత్‌ అంకిరెడ్డి, ఎడిటింగ్‌ – మార్తాండ్‌ కె వెంకటేష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ – లక్ష్మీ మురారి, మ్యూజిక్‌ – శ్రీ వసంత్‌.