గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబో ఈద్ సందర్భంగా ఫస్ట్ స్ట్రైక్ వీడియోను విడుదల చేయడంతో మాస్ ఫీస్ట్‌ని అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వ ప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి ‘విశ్వం’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలను వాయిస్తూ, పూజారి మంత్రాలు పఠించడం, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకలతో ఫస్ట్ స్ట్రైక్ వీడియో ప్రారంభమవుతుంది. గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ని భుజంపై వేసుకుని పెళ్లి వేదిక వైపు నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు. అది గిటార్ కాదు, మెషిన్ గన్. ఆశ్చర్యకరంగా, అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ కాల్చడం ప్రారంభిస్తారు. చివరగా, అతను అక్కడ ఫుడ్‌ని ఆస్వాదిస్తూ, ”దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్… ఇస్పే లిఖా మేరే నామ్..’ అని చెప్పడం చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో గోపీచంద్‌ని నెగెటివ్ షేడ్‌లో చూడటం నిజంగా సర్ప్రైజింగ్‌గా ఉంది. ఆయన డైలాగ్ పలికిన విధానం క్యారెక్టర్ గ్రే షేడ్‌ని సూచిస్తుంది. శ్రీను వైట్ల ఫస్ట్ స్ట్రైక్‌ని మాస్ ఫీస్ట్‌గా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించారు. కేవీ గుహన్ నైపుణ్యం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. చైతన్ భరద్వాజ్ స్కోర్ సినిమా సాంకేతికంగా ఎంత రిచ్‌గా ఉందో తెలియజేస్తుంది. అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ కన్నుల విందును అందిస్తుంది. దీనికి గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. అమర్‌రెడ్డి కుడుముల ఎడిటర్‌గా, కిరణ్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడి చేస్తామని మేకర్స్ తెలిపారు.