ఫ్రిజ్‌లో ఐస్‌ గడ్డ కడుతోందా..?

ఫ్రిజ్‌ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సర్వసాధారణమైపోయింది. సింగిల్‌ డోర్‌ ఫ్రిజ్‌లో తరచుగా ఐస్‌ గడ్డకడుతూ ఉంటుంది. ఫ్రీజర్‌ని ఎంత శుభ్రం చేసినా గడ్డకుడుతూనే ఉంటుంది.
ఈ సమస్యకు ప్రధాన కారణం తెలియక చాలా మంది అలాగే వదిలేస్తుంటారు. ఫ్రిజ్‌ డోర్‌ లేదా డోర్‌ గ్యాస్‌కట్‌ చెడిపోయినప్పుడు అంటే రబ్బరు చెడిపోయి బయటి గాలి లోపలికి వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది.
నీటిని శుభ్రపరిచే వాటర్‌ ఫిల్టర్‌ సరిగా పనిచేయకపోతే కూడా ఐస్‌ గడ్డ కడుతుంది. ఇది మీ ఫ్రిజ్‌లోని అన్ని వస్తువులను స్తంభింపజేస్తుంది. కాబట్టి వాటర్‌ ఫిల్టర్‌ మార్చడమే దీనికి పరిష్కారం.
ఫ్రిజ్‌లో దిగువ నుండి నీరు పోయే గొట్టం ఉంటుంది. ఈ ట్యూబ్‌ బ్లాక్‌ అయితే మీ ఫ్రిజ్‌ లోపల ఐస్‌ గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ట్యూబ్‌ను తరచుగా శుభ్రం చేయాలి. మురికిని శుభ్రం చేయడానికి సబ్బును ఉపయోగించండి. ట్యూబ్‌లో ఏదైనా చిక్కుకుపోయినట్లయితే, దాన్ని బయటకు తీయడానికి స్ట్రింగ్‌ని ఉపయోగించవచ్చు.
ఫ్రిజ్‌ వెనుక భాగంలో చల్లగా ఉండటానికి సహాయపడే కాయిల్స్‌ ఉంటాయి. ఈ కాయిల్‌ మురికిగా లేదా మంచుతో కప్పబడి ఉంటే ఫ్రిజ్‌ సరిగ్గా పనిచేయదు. ఫ్రిజ్‌లో ఎక్కువ ఐస్‌ పేరుకుపోతుంది.