వలస కార్మికులపై ఇంత నిర్లక్ష్య‌మా?

– 4 వారాల్లో వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి
– రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: వలస కార్మికులకు రేషన్‌ కార్డుల జారీ విషయంలో రాష్ట్రాల నిర్లక్ష్య ధోరణని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వెరిఫికేషన్‌ పేరుతో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లోగా వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని ఆదేశించింది. రేషన్‌ కార్డుల కోసం ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తుండటం చాలా దురదష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా వలస కార్మికులకు రాష్ట్రాలు రేషన్‌ అందించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాలు మాత్రమే వారికి రేషన్‌ కార్డుల జారీ కోసం 100శాతం వెరిఫికేషన్‌ పూర్తి చేశాయి. పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా ఈ విషయాన్ని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు దష్టికి తీసుకొచ్చారు. కార్డులు జారీ అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు కార్మికులకు రేషన్‌ అందజేయడం లేదని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు రేషన్‌ రావట్లేదని ఆయా రాష్ట్రాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దురదష్టకరమైన విషయం. నాలుగు నెలలైనా వెరిఫికేషన్‌ ప్రక్రియను ఎందుకు పూర్తిచేయలేదు.