ఇదేమి దారి.. మరీ ఇంత అద్వానమా..

This is the way.. is it too advanced..– పట్టించుకునే వారే లేరా!
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఇదేమి దారి మరి ఇంత అద్వాన్నమా దీనిని పట్టించుకునే వారే లేరా అని ఆ వీధి ప్రజలు సీపీఐ(ఎం) నాయకులు అంటున్నారు. మంగళవారం మండలంలోని పసర పంచాయతీ పరిధిలోని  నాలుగవ వార్డు ఫారెస్ట్ ఆఫీస్ వెనకాల గల రోడ్డు ను సీపీఐ(ఎం) నాయకులు పరిశీలించారు. అధ్వానంగా మారిన ఈ వాడ ప్రజలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్డు కు ఇరువైపులా చెట్లు పెరిగి చెత్తాచెదారం పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు మధ్యలో కాలువ ఏర్పడి రోడ్డు మొత్తం బురదమయంగా మారింది. ఈ విషయాన్ని అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆ వాడ ప్రజలు సీపీఐ(ఎం) పార్టీ ప్రతినిధి బృందానికి తమ గోడు వెల్లబోశారు. ఇప్పటికైనా ఈ విషయంలో సంబంధిత  అధికారులు  ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రజలు నడవడానికి అనుకూలంగా మార్చాలని సీపీఐ(ఎం) పార్టీ నాయకులు డిమాండ్ చేశారు లేనియెడల రోడ్డు నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి తీగలు ఆదిరెడ్డి ప్రజల చిట్టిబాబు గొంది రాజేష్ గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు కొట్టే కృష్ణారావు సింగల్ విండో డైరెక్టర్ సప్పిడి ఆదిరెడ్డి సోమ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.