స్నేహమంటే ఇదేరా..

స్నేహమంటే ఇదేరా..నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. నూతన దర్శకుడు విజరు బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్రెండ్‌ షిప్‌కి మంచి ప్రాముఖ్యత ఉంది. సినిమాలోని ఆ లేయర్‌ని ఒక గ్లింప్స్‌ ద్వారా మేకర్స్‌ రివీల్‌ చేసి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. అలాగే ఇందులో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘అంజి’గా ఆయన పాత్రను గ్లింప్స్‌ ద్వారా పరిచయం చేశారు. ఇది కేవలం పాత్రను పరిచయం చేయడానికే కాదు, అల్లరి నరేష్‌తో నాగార్జునకు ఉన్న రిలేషన్‌ని చాలా అద్భుతంగా చూపించింది. మాటొచ్చేత్తది అనేది తను తరుచుగా వాడే మాటే. ఇది మాట మీద నిలబడే వ్యక్తిగా అతని పాత్రను సూచిస్తుంది. శివేంద్ర దాశరధి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించగా, కీరవాణి తన ఆకర్షణీయమైన సంగీతంతో విజువల్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. గ్లింప్స్‌ ద్వారా ఈ సినిమా టీజర్‌ను త్వరలో విడుదల చేస్తామని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఆషికా రంగానంద్‌ ఈ చిత్రంలో కథానాయిక. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.