పేట్రేగిపోతున్న ఇజ్రాయిల్‌

Israel is on fire– గాజాలో 120 మంది ఊచకోత
– లెబనాన్‌లో మరో 15 మంది మృతి
గాజా: అమెరికా అండ చూసుకుని ఇజ్రాయిల్‌ అంతకం తకూ పేట్రేగి పోతోంది.మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా పచ్చి మితవాది డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ ఎన్నికైన తరువాత నెతన్యాహు యుద్ధోన్మాదం పతాక స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా పరిగణించి ,అయన అరెస్టుకు వారెంట్‌ కూడా జారీ చేసింది. అయినా, డోన్ట్‌ కేర్‌ అన్న రీతిలో ఈ ఫాసిస్టు నేత వ్యవహరి స్తున్నాడు.గడిచిన 48గంటల్లో ఇజ్రాయిల్‌ జరిపిన క్రూర దాడుల్లో గాజాలో 120 మంది, బీరుట్‌లో 15 మంది మరణిం చారు. గాజా స్ట్రిప్‌ అంతటా ఇజ్రాయిల్‌ తన సైనిక దాడులను తీవ్రతరం చేసింది. గాజా ఉత్తర కోస్తా తీరాన ఉన్న ఆసుపత్రిపై బాంబుల వర్షం కురిపిం చింది. ఈ పాశవిక దాడిలో వైద్య సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇదిలా వుండగా శనివారం లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది చనిపోయారు.