– మీడియా
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) త్వరలో దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోందని పేరు చెప్పని ఒక అమెరికన్ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ అమెరికన్ న్యూస్ చానల్ ఏబీసీ న్యూస్ శనివారం రిపోర్ట్ చేసింది. ఈ దాడి ”చాలా పరిమితమైనది”గా ఏబీసీ న్యూస్ అభివర్ణించింది. అయితే దాని స్వభావం గురించి లేదా అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని గురించి కొన్ని వివరాలను అందించింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ఉన్న దళాలతో బుధవారం ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతున్నప్పుడు పొరుగు రాష్ట్రంలో సంభావ్య గ్రౌండ్ ఆపరేషన్‌ను ప్రకటించాడు. గత వారంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు ”మీ ప్రవేశానికి అవకాశం కోసం” ప్రాంతాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా సాగాయని ఆయన అన్నాడు.
హలేవి ప్రకారం, ఇజ్రాయెల్ ఇప్పటికీ ఉత్తర ప్రాంతాల నుంచి స్థానభ్రంశం చెందిన నివాసితులను వారి ఇండ్లకు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ”దీని కోసం, మేము గ్రౌండ్‌ని సిద్ధం చేస్తున్నాం” అని ఆపరేషన్‌కు దిగే కాలాన్ని వెల్లడించకుండా జనరల్ చెప్పాడు. ”మీరు లోపలికి వెళ్లి అక్కడ ఉన్న శత్రువులను, వారి మౌలిక సదుపాయాలను నిర్ణయాత్మకంగా నాశనం చేస్తారు” అని హలేవి చెప్పాడు. హిజ్బుల్లా గ్రామాలను ”భూగర్భ మౌలిక సదుపాయాలు, స్టేజింగ్ పాయింట్లు, మా భూభాగంలోకి లాంచ్ ప్యాడ్‌లతో పెద్ద సైనిక అవుట్‌పోస్టులుగా మార్చారు.”
ఇజ్రాయెల్, హిజ్బుల్లా, హమాస్‌లకు వ్యతిరేకంగా పశ్చిమ జెరూసలేం సైనిక చర్య వెలుగులో పాలస్తీనా కారణానికి మద్దతు ఇచ్చినందున గతేడాదిలో అడపాదడపా కాల్పులు జరిగాయి. పశ్చిమ జెరూసలేం ఈ నెల ప్రారంభంలో షియా మిలీషియా సమూహానికి వ్యతిరేకంగా తన దాడులను తీవ్రంగా పెంచింది. హిజ్బుల్లా హ్యాండ్‌హెల్డ్ కమ్యూనికేషన్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన విధ్వంసక చర్యలో వేలాది మంది గాయపడ్డారు. తదనంతరం దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ చెలరేగిపోయింది. లెబనీస్ ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ దాడులలో కనీసం 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు.
లెబనీస్ రాజధాని బీరుట్‌లోని దక్షిణ శివారులో గ్రూప్ ప్రధాన కార్యాలయంగా అభివర్ణించబడిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మరణించిన ఒక రోజు తర్వాత ఏబీసీ నివేదిక వచ్చింది. శనివారం తెల్లవారుజామున మిలీషియా తన నాయకుడి మరణాన్ని ధవీకరించింది. నస్రల్లాకు వారసుడి పేరు లేదు.
పశ్చిమ జెరూసలేం శనివారం తరువాత హిజ్బుల్లా సైనిక నాయకులందరినీ హతమార్చినట్టు ప్రకటించింది. గత కొన్ని వారాలుగా హతమైన డజను మంది టాప్ కమాండర్ల జాబితాను కూడా షేర్ చేసింది. ”వేలాది మంది అమెరికన్లు, ఇజ్రాయెలీలు, లెబనీస్ పౌరులతో సహా అతని అనేక మంది బాధితులకు దీనితో న్యాయం జరిగింది” అని పేర్కొంటూ నస్రల్లా మరణంపై వాషింగ్టన్ ప్రతిస్పందించింది. ఇది పశ్చిమ జెరూసలేం ”తనను తాను రక్షించుకునే హక్కు” కోసం తన పూర్తి మద్దతును అమెరికా పునరుద్ఘాటించింది.
అయితే అమెరికా సంఘర్షణను తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తుందని, లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు యావత్ మధ్యప్రాచ్యాన్ని యుద్ధంలోకి నెట్టే ప్రమాదం ఉందని ప్రపంచంలోని శాంతి కాముకులు హెచ్చరిస్తున్నారు.