న్యూయర్క్ : గ్రౌండ్ ఆపరేషన్‌కు సన్నద్ధమవుతున్న ఇజ్రాయెల్ బలగాలు.. నిన్న ఉత్తర గాజాలోని పాలస్తీనీయులకు హెచ్చరికలు చేశాయి. 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని ఆదేశించాయి. దీంతో ప్రాణభయంతో అనేక మంది వలసబాట పట్టారు. కార్లు, ట్రక్కుల్లో.. గాడిదలు లాగే బండ్లలో.. దుప్పట్లు, ఇతర సామాన్లు సర్దుకొని చాలామంది బిక్కుబిక్కుమంటూ గాజా సిటీని వీడుతూ కనిపించారు. దీంతో ఇజ్రాయెల్ ఆదేశాలను ఐక్యరాజ్యసమితి (ఖచీఉ) తీవ్రంగా ఖండించింది. ఉత్తర గాజాలో ప్రజల సంఖ్య దాదాపు 11 లక్షలు. వారందరూ 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం అసాధ్యమని, ఇజ్రాయెల్ అల్టిమేటం అత్యంత ప్రమాదకరమని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.