పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ యుద్ధం అమానుషం

– సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాలస్తీనాపై అమెరికా అండదండలతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధం అమానుషమని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశంతో చేసుకున్న ఆర్థిక, సైనిక, ఇతర ఒప్పందాలు తక్షణమే భారత్‌ రద్దు చేసుకోవాలనీ, పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ ఏకపక్ష దాడులు నిలిపివేసేలా ఐక్యరాజ్య సమితి చిత్తశుద్ధితో కషి చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు చేస్తూ అక్కడ మారణహోమాన్ని సృష్టిస్తున్నదని అవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనాలోని సుమారు 38 వేల మందికి పైగా స్త్రీలను, పిల్లలను, ప్రజలను, బాంబు దాడులు, కాల్పుల ద్వారా, చంపేసిందని తెలిపారు.