ఉపాధ్యాయులకు నియామక పత్రాల అందజేత

Issuance of appointment letters to teachersనవతెలంగాణ – ఏర్గట్ల
రాష్ట్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన డీఎస్సి ఫలితాల్లో,మండలానికి కొత్తగా ఎంపికై వచ్చిన ఉపాధ్యాయులకు, ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ఆనంద్ రావ్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి కొత్తగా 5 మంది స్కూల్ అసిస్టెంట్లు,13 మంది ఎస్జీటీలు వచ్చారని,వారికి బుధవారం నియామక పత్రాలను అందజేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణాచారి, సత్యానంద్, కృష్ణప్రసాద్,రాజశేఖర్,తదితరులున్నారు.