భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎల్.గంగామణి హార్ట్ సర్జరీ అవసరమై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు రూ.1.25 లక్షల రూపాయల ఎల్వొసి మంజూరు చేయించి ఎల్ఓసి కాపీ ని వారి కుటుంబ సభ్యులకు ఈరోజు హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు రూ.1 లక్ష 25 వేలు రూపాయల ఎల్ఓసి మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి గారి మేలు మర్చి పోలేమని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజి మంత్రి,ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలియజేసారు.