పదోన్నతి పొందిన కార్యదర్శులకు ఉత్తర్వులు అందజేత..

– శుభాకాంక్షలు తెలిపిన ఎంపిపిఎంపిడిఒలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల ప్రభుత్వం జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు పదోన్నతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను గురువారం ఎం.పి.పి శ్రీరామ మూర్తి,ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావులు మండల పరిషత్ కార్యాలయంలో  పదోన్నతి పొందిన 14 మందికి వారి చేతులు మీదుగా అందజేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తరుపున, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పంచాయితీ కార్యదర్శులకు ఇచ్చిన మాట ప్రకారం 4 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శికి పదోన్నతి కల్పించడంతో పాటు రెగ్యులర్  చేస్తానని  పే స్కేల్ ను వర్తింప జేస్తానని ఇచ్చిన మాటను నిలపెట్టుకున్నారని అన్నారు.
ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మండలంలో 30 పంచాయితీలకు 28 మంది కార్యదర్శులు ఉన్నారని,ఇందులో 14 మందిని రెగ్యులర్ చేసారని తెలిపారు. అనంతరం స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఈ.ఒ  హరికృష్ణ,పంచాయితీ కార్యదర్శి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.