సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత..

CMRF will hand over cheques..నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండల కేంద్రానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే స్వహగ్రం లో అందజేశారు. బి చంద్రయ్య ముఖ్యమంత్రి సహాయనిది కింద మంజూరు అయిన రూ. 18,000/- విలువ గల చెక్కును, అదేవిధంగా ఆర్ రాజుకు మంజూరు అయిన రూ. 60,000/- విలువ గల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును బోథ్ శాసన సభ్యులు అనిల్ జాధవ్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువజన సంఘం అధ్యక్షులు డుబ్బుల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.