
మండలంలోని చేంగల్ గ్రామానికి చెందిన సాయన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో చేరగా డాక్టర్లు ఆపరేషన్ చేయాలని తెలపడంతో వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 80 వేల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించారు. అట్టి పత్రాన్ని బాధితునికి బుధవారం అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.