యాదగిరిగుట్ట మండలం చోల్లేరు శనివారం, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా గ్రామానికి చెందిన కొరకొప్పుల సత్తయ్య కాలు సర్జరీ కొరకు పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో వైద్యం ఖర్చులకు లక్షా యాభై వేల రూపాయల ఎల్ ఓ సి చెక్కును యాదగిరిగుట్ట ఎమ్మెల్యే ఆఫీసులో అందజేశారు. ఈ కార్యక్రమంలో చోల్లేరు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్నం శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ గౌడ్, రెడ్ల రేపాక మాజీ సర్పంచ్ మాద శంకర్ గౌడ్, దొంతిసారం నవీన్, అర్వోజు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.