ఐకేపీ వీఓఏల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

ఐకేపీ వీఓఏల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలినవతెలంగాణ-ఆసిఫాబాద్‌
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఐకేపీ వీఓఏల సమస్యలు ప్రస్తావించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ కోరారు. ఐకేపీ వీఓఏతో కలిసి ఎమ్మెల్యే కోవలక్ష్మి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చూపిన విధంగా వేతనాలు చెల్లించాలన్నారు. గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగత ఖాతాలో వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రతి గ్రామ సంఘానికి ల్యాప్టాప్‌ అందజేయాలని, కనీస వేతనం రూ.26,000 ఉండేలా చూడాలన్నారు. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి కల్పించాలన్నారు. సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో మాట్లాడగా అసెంబ్లీలో తప్పకుండా సమస్యలపై మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమ, జ్యోతి, ఉపాధ్యక్షులు సంతోష్‌, ఆసిఫాబాద్‌ మండల అధ్యక్షుడు బుద్దు, నాయకులు సుదర్శన్‌, రమేష్‌, లక్మి, ఓమాజీ, కల్పన, పద్మ, వినోద్‌, ఫర్జానా, కవిత పాల్గొన్నారు.