ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

Issues of outsourcing workers should be resolvedనవతెలంగాణ – ఆర్మూర్ 

ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నర్సింగ్ రావు అన్నారు. జీవో ఎంఎస్ నంబర్ 4 ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు 20, 21 జూన్ నుండి 30% పెంచడం జరిగిందని, పెరిగినటువంటి వేతనాలు 2023 జూలై నుండి మాత్రమే చెల్లించటం జరిగిందని, ఇట్టి విషయమై చైర్పర్సన్ కు, కమిషనర్  విన్నవించినట్టు తెలిపారు. కార్మికుల విద్య అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని, కనీస వేతనం రూ.26,000 నిర్ణయించాలని అన్నారు. ఈఎస్ఐ ,పీఎఫ్ సకాలంలో చెల్లించి కార్డులు ఇవ్వాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు బాబురావు ,తదితరులు పాల్గొన్నారు.