ఇసుజు డి-మ్యాక్స్‌ అంబులెన్స్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ : ఇసుజు మోటార్స్‌ ఇండియా కొత్తగా ‘డీ-మ్యాక్స్‌ అంబులెన్స్‌’ను ఆవిష్కరించింది. దీని ఎక్స్‌ షోరూం ప్రారంభ ధరను రూ.25.99 లక్షలుగా నిర్ణయించింది. 1.9 లీటర్‌ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన ఈ అంబులెన్స్‌ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన విధంగా ఉండేలా దృఢంగా తయారు చేసినట్టు ఆ కంపెనీ తెలిపింది. రోగుల అవసరాలకు అనుగుణంగా డిజైన్‌ చేసినట్టు పేర్కొంది. ప్రీ-టెన్షనర్‌ లోడ్‌ లిమిటర్స్‌తో డ్రైవర్‌, కో-డ్రైవర్‌ సీట్స్‌ కు 3-పాయింట్‌ సీట్‌ బెల్ట్స్‌, సీట్‌ బెల్ట్‌ హెచ్చరిక సిస్టమ్‌, ఎయిర్‌ బ్యాగ్స్‌, ఫ్రంట్‌ క్యాబిన్‌ కొరకు కొలాప్సిబుల్‌ స్టీరింగ్‌ కాలమ్‌, సైడ్‌ ఇంట్రూషన్‌ రక్షణ బీమ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపింది.