ఇసుజు ఐ-కేర్‌ మాన్‌సూన్‌ క్యాంప్‌

హైదరాబాద్‌ : ఇసుజు మోటర్స్‌ ఇండియా దేశవ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్‌ మాన్‌సూన్‌ క్యాంప్‌’ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దీన్ని ఇసుజు డి-మాక్స్‌ పికప్‌లు, ఎస్‌వియుల శ్రేణీ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అన్ని ఇసుజు అధీకృత డీలర్‌ సర్వీస్‌ అవుట్‌లెట్‌లలో జులై 22 -28 నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో వినియోగదారులు తమ వాహనాలకు ప్రత్యేక ఆఫర్‌లు, ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది.