హిట్‌ ఖాయం..

Hit sure..‘నాకు ఈ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మధ్యలో ఫెయిల్యూర్స్‌ వచ్చినప్పటికీ నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నా’ అని హీరో సాయిరామ్‌ శంకర్‌ చెప్పారు. ‘ఒక పథకం ప్రకారం’లో ఆయన నటించారు. మలయాళ దర్శకుడు వినోద్‌ కుమార్‌ విజయన్‌ దర్శకత్వం వహించారు. గార్లపాటి రమేష్‌, వినోద్‌ కుమార్‌ విజయన్‌ నిర్మించారు. ఈనెల 7న సినిమా రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా హీరో సాయిరాం శంకర్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్‌ వారికి ఉంటుంది. కాబట్టి ‘ఒక పథకం ప్రకారం’ అనే టైటిల్‌ సెలెక్ట్‌ చేసుకున్నాం. మా అన్నయ పూరి జగన్నాథ్‌ ట్రైలర్‌  చూసి, కొత్తగా ఉందని అన్నారు. విశ్రాంతిలోపు విలన్‌ ఎవరో చెప్తే వారికి రూ.పదివేలు బహుమతిగా ఇస్తాం. ఈ కాంటెస్ట్‌ వల్ల చాలా మందికి సినిమా రీచ్‌ అయ్యింది. ఇందులో నేను క్రిమినల్‌ లాయర్‌ని. నెమ్మదిగా నా క్యారెక్టర్‌లోని ఒక్కో షేడ్‌ బయట పడుతుంది. క్రిమినలా లేకపోతే క్రిమినల్‌ లాయరా అనిపించేలా ఉంటుంది. వినోద్‌కుమార్‌ మలయాళ డైరెక్టర్‌ అయిన ప్పటికీ తెలుగు సినిమాలు, ఇక్కడి స్టైల్‌ బాగా ఇష్టం. ‘మలయాళంలో ఓ పాయింట్‌ పట్టుకుని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కుదరదు, కష్టం’ అంటారు ఆయన. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఫైట్‌ సీన్స్‌ని, సాంగ్స్‌ను డిజైన్‌ చేశారు. తమిళ ఫైట్‌ మాస్టర్‌ ఢిల్లీ బాబు ఫైట్స్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు. హొ సినిమా అంతా క్రైమ్‌ జోనర్‌లో సాగుతున్నప్పటికీ ఇందులో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. మా సినిమా విడుదల రోజు ‘తండేల్‌’ కూడా రిలీజ్‌ కాబోతోంది. అయితే దీన్ని నేను పోటీగా ఫీలవ్వను. ప్రస్తుతం ఓ మైథలాజికల్‌ సిరీస్‌తో పాటు ‘రీసౌండ్‌’ సినిమా చేస్తున్నాను. ఇకపై హీరోగానే కాదు, క్యారెక్టర్‌ బాగుంటే ఎలాంటి రోల్‌ అయినా చేస్తాను.