– సుమారు 60 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు
– అర్ధరాత్రి నుండి ఏకధాటిగా కురిసిన వర్షం
– అధికారికంగా నిన్నటి వర్షపాతం 46.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
– గురువారం సుమారు 20.6 వర్షం పడినట్లు అంచనా వేసిన అధికారులు
నవతెలంగాణ -కంటేశ్వర్
గత రెండు రోజులుగా వర్షం కురుస్తున్నప్పటికీ మధ్యమధ్యలో వర్షం ఆగుతూ కురుస్తూ ఉంటుంది అయితే మొత్తం 24 గంటల్లో 46.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గురువారం సుమారు 20.6 వర్షం పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు తప్ప 24 గంటలు గడిస్తే కానీ ఎంత వర్షపాతం నమోదయింది అనేది చెప్పలేని పరిస్థితి. సుమారు నిజామాబాద్ జిల్లాలో 40 రోజుల తర్వాత వర్షం కురిసింది. ఎండలు వర్షాకాలంలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో వర్షాలు కురవడంతో రైతులతో పాటు సాధారణ ప్రజలకు ఉప శమనం కలిగించింది. నిజామాబాద్ జిల్లాలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 260 మి.మీ వర్షం కురిసింది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు వాగుల్లోకి నీరు చేరి | మత్తళ్లు పొస్తుండగా భీముని పాదం జలపాతం వద్ద వాటర్ ఫాల్స్ ఉధృతంగా పడుతోంది. వాగుల వద్ద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో పోలీసులు, రెవెన్యూ, ప్రజాప్ర తినిధులు సైతం పలు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వాగుల వద్ద బారీకేడ్లతో పాటు ట్రాక్టర్లను అడ్డం పెట్టి ప్రజలు వాగు దాటకుండా చర్యలు చేపడు తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మున్సిపల్ అధికారులు రెవిన్యూ సిబ్బంది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ టికెటింగ్లు ఏర్పాటు చేసి నిజాంబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడ కూడా నీరు ఆగకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతం లో అపార్ట్మెంట్ వెనుక ఉన్నటువంటి మోరి మూతపడడంతో ఆమోదిలో నుండి వెళ్లాల్సిన నీరు వెళ్లలేక కాలనీ మొత్తం జలమయమై ఇండ్లలోకి నీరు వెళ్లి చేరింది. దీంతో ప్రజలు లబోదిబోమని తలలు పట్టుకున్నారు. 11 గంటల తర్వాత వర్షం ఆగిపోయేసరికి ప్రజలు ఊపిరి పీల్చుకొని తమ కాలనీ శుభ్రం చేసుకున్నారు. అలాగే చంద్రశేఖర్ కాలనీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉమెన్స్ కాలేజీ చౌరస్తా ప్రాంతంలో కూడా మీరు రోడ్డుపై చేరి జగమయమయ్యింది కంటేశ్వర్ ప్రాంతంలో కూడా రోడ్లపై నీరు జలమయమయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 60 డివిజన్లో పరిస్థితి అదే ఉంది హై క్లాస్ ప్రాంతాలలో మాత్రమే నీరు సాఫీగా వెళ్లే విధంగా ఉంది తప్ప మిగతా ప్రాంతాలలో చిన్నపిల్లలు రోడ్లపై వెళ్లాలంటే నీటిలో మునిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు నిజామాబాద్ ప్రజలు వేడుకుంటున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వర్షం పడలేదు బుధ వారం 46.8 వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. గురువారం 20 పాయింట్ 6 వర్షపాతం నమోదైనట్లు తెలుపుతున్నప్పటికీ పూర్తిగా అంచనా వేయలేము. 24 గంటలు గడిస్తే గాని ఎంత వర్షపాతం నమోదయింది అనేది తెలియదు. కానీ ప్రస్తుతం పడ్డ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి అవి కూడా ప్రతిసారి మీరు నిల్వ ఉండచోటే ఉంటున్నాయి. అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున 9 10 గంటల వరకు వర్షం కురుస్తుంది. ఆ తర్వాత మధ్యలో రెండు మూడు గంటలు వర్షం ఉండడం లేదు. దాని తర్వాత గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం ఇంకా కుండపోతగా కురుస్తూనే ఉంది. వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.