గ్రామ అభివృద్ధికి పాటుపడతా..

నవతెలంగాణ – మోర్తాడ్

మోర్తాడ్ గ్రామ అభివృద్ధికి తర్వాత సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్చార్జి  నాయకుడు సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మోర్తాడ్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు సునీల్ రెడ్డిని సన్మానించారు. మోర్తాడ్ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామవతి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేయగా తాను సొంత గ్రామంలో సకరించి గ్రామాన్ని అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను మోర్తాడ్ గ్రామంలోని నివాసం ఉంటున్నానని తన సొంత గ్రామంగా భావించి గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు. తమ విన్నపాన్ని స్వీకరించి అభివృద్ధికి సహకరిస్తానన్న ముత్యాల సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ బుద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, సభ్యులు రాజేందర్ ,అశోక్ ,రాజేశ్వర్ ,రాజ్ విట్టల్, హరీష్ గౌడ్ ,శివకుమార్ ,పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.