
నవతెలంగాణ – డిచ్ పల్లి
కులగణతోనే ఎస్సీ వర్గీకరణ, అన్ని కులాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మాదిగల పార్లమెంట్ నియోజకవర్గ సదస్సులో భాగంగా బుధవారం డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి గ్రామంలో బరికుంట శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో డాక్టర్ పిడమర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల గణననా చేయకుండా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తద్వారా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీల కులాలలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలు అలాగే ఉండి పోయాయని ,కేవలం కుల గణన చేస్తేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవు తుందన్నారు.ఉత్తర తెలంగాణ ప్రజలు అల్లర్లకు, మతవిద్వేషాలకు తావునీయకుండా బిజెపి పార్టీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి తీరాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం మాదిగలకు మాయమాటలు చెప్పి మాదిగల ఓట్ల ద్వారానే ఉత్తర తెలంగాణలో బీజేపీ పార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందని మాదగలకు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ హామీని నెరవేర్చకుండా కమిటీలతో కాలయాపన చేస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ కేవలం బిజెపి పార్టీనే అని అన్నారు. మాదిగలు బిజెపి పార్టీకి ఓటు వేస్తే ఈసారి కేంద్రంలో అధికారం కోల్పోతున్న ఆ పార్టీ మాదిగల సమస్యలు చెప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ తో ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. వర్గీకరణ చేసిన తర్వాతనే బిజెపి వాళ్లు మాదిగ పల్లెలో అడుగుపెట్టి ఓట్లు అడగాలన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేయడానికి చూస్తే మాదిగలు మోసపోవడానికి సిద్ధంగా లేరని హెచ్చరించారు. 12 శాతం జనాభా కలిగిన మాదిగలకు అన్ని రంగాల్లో సమాన వాట కలిపించి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు బరికుంట శ్రీనివాస్. మాదిగ ఉద్యోగస్తుల సంఘం జిల్లా నాయకులు తెడ్డు గంగారం మాదిగ. ఎం హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్, జేఏసీ నాయకుడు సోమనాదం, మాజీ సర్పంచ్ యాదయ్య, నాగేందర్, పిల్లి విజయ్ కుమార్, జనార్ధన్, ప్రశాంత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.