స్నేహ సొసైటీలో దివ్యాంగ విద్యార్థులు సపోజ్ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం

– స్నేహ సొసైటీలో ఘనంగా సపోజ్ క్రిస్టమస్ వేడుకలు
నవతెలంగాణ- కంటేశ్వర్ 
స్నేహ సొసైటీ దివ్యంగా విద్యార్థులు సపోస్ క్రిస్టమస్ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని విద్యార్థులు వికలాంగులు కారని సకలాంగుల కంటే మిన్న అని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని స్థానిక మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో సపోజ్ క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు మాట్లాడుతూ.. ఈ రోజులలో తల్లిదండ్రులు భారమని భావిస్తున్న చిన్నారులు స్నేహ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి దివ్యాంగులకు విద్యను ఆరోగ్యాన్ని అందిస్తూ క్రీడలలో ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ కి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడని ఒక్కొక్క మతస్తులు వారి గ్రంథాలను పవిత్ర గ్రంధాలుగా భావిస్తారని అన్ని గ్రంథాలు పాఠశాలలో అన్ని ఒకటేనని ప్రేమ సౌబ్రాతత్వం అని తెలియజేశారు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మంచి సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. అదేవిధంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ దివ్యాంగుల్లో మంచి ప్రతిభతో పాటు దివ్యాంగుల దినోత్సవం రోజు స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించడం అదేవిధంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలలో సైతం వారి ప్రతిభను స్నేహ సొసైటీ యాజమాన్యం ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దివ్యాంగ విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకున్నప్పటికీ వారి ప్రతిభకు భంగం కలవకుండా చక్కగా శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ అంటే ఆరాధన అని క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని ఏసుప్రభు ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన తన చివరి రక్తం బొట్టు ప్రజల కోసం కష్టపడ్డారని ఏసుప్రభు గురించి క్లుప్తంగా తెలుపుతూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర మేయర్ అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సీఎస్ఐ చర్చ్ పాస్టర్ స్టాన్లీ పాల్గొని మాట్లాడుతూ సపోస్ క్రిస్మస్ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణంలో నిర్వహించడం ఎందుకు నృత్యం వివిధ రకాల వేషధారణలతో రూపొందించిన అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు సిఎస్ఐ చర్చి తరఫున తెలియజేస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కోఆర్డినేటర్ కిరణ్మయి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని, వివేక్ టెన్నిసన్, మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు సిబ్బంది అందుల పాఠశాల విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.