
వడ్డే ఓబన్న జయంతి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించడం వడ్డెర జాతికి గర్వకారణంగా ఉందని వడ్డెర వృత్తిదారుల సంఘం చౌటుప్పల్ మండల నాయకులు బోదాసు నరేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వడ్డెరుల ఆత్మగౌరవం కోసం స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి వడ్డే ఓబన్న 218వ జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తెలంగాణలో ఉన్న వడ్డెరలను గుర్తించి క్వారీలపై హక్కులు కల్పించాలి,యంత్రాలపై సబ్సిడీ ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోదాసు నరేష్ కోరారు.