జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటు: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

నవతెలంగాణ-భిక్కనూర్
న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచితే సమస్యలు పరిష్కరించకపొవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. కార్మికులకు సమ్మెకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మాజీ మంత్రికి మా సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల జీవితాలలో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, జిపి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న జీపీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని లేనిచో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీబీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, నాయకులు బల్యాల సుదర్శన్, లింగారెడ్డి, సురేష్, గ్రామపంచాయతీ రాష్ట్ర జేఏసీ నాయకులు యాదగిరి, మండల అధ్యక్షులు శ్యామ్, ఉపాధ్యక్షులు సిద్ధ రాములు, కార్యదర్శి స్వామి, నాగభూషణం, గ్రామపంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.