నవతెలంగాణ-గీసుగొండ
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలను నిరంతరం ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో పని చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మంత్రి సత్యవతిరాథోడ్ స్థాయిని మరచి విమర్శించడం సిగ్గు చేటని కాంగ్రెస్ జిల్లా నాయకులు చాడ కోమురారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌లు హెచ్చరించా రు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ మండలంలో నిన్న ప లు అభివృద్ధిపనుల్లో భాగంగాపాల్గొన్న మంత్రి సత్య వతి రాథోడ్, ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు పరుశపదజాలం వాడడం తగదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నె రవేర్చకుండా మభ్యపెడుతూ 9ఏళ్ల కాలం గడిపినా బీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్, ఎమ్మెల్యే చీటర్లని మీ బీ ఆర్‌ఎస్ పార్టీ ఒక చీటర్ పార్టీ అని ,కేసీఅర్ ఎమ్మెల్యే చిటర్లని మండిపడ్డారు. మంత్రి సత్యావతిరాథోడ్, ఎమ్మెల్యే చల్లాబహిరం గం గా క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో సాయిలి ప్రభా కర్, అప్పని కరుణాకర్, కు సం రమేష్, వజ్ర రాజు, సుభాష్, కో-అప్షన్ మెంబర్ ఎండి.రహీమ్, కాందరిసంతోష్, వెంకటేష్, నాగరా జు, గుండెకారి రాజు, వినరు, మోటం స్వామి, మా ర్గం వెంకటేశ్వర్లు, రాజు, మోహన్‌లు పాల్గొన్నారు.