– మార్పును ప్రతిఘటిస్తున్న ప్రభావంతమైన దేశాలు
న్యూయార్క్ : ప్రస్తుత ప్రపంచం ‘ద్వంద్వ ప్రమాణాలు’ ప్రపంచమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వాఖ్యానించారు. కొన్ని ప్రభావంతమైన స్థానాల్లో ఉన్నదేశాలు మార్పు కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రతిఘటిస్తున్నాయని అన్నారు. ఐక్యరాజ్య సమితి భారతదేశం, ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత మిషన్ ఏర్పాటు చేసిన ఒక మంత్రుల సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రాజకీయ సంకల్పం కంటే ఇక్కడ మార్పు కోసం రాజకీయ ఒత్తిడి ఉండాలని నా ఆలోచన’ అని జైశంకర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మనోభావాలను దక్షిణాసియా ప్రతిబింబిస్తుందని, అయితే ఇదే సమయంలో ఇక్కడ రాజకీయ ప్రతిఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. ‘ప్రపంచంలో ప్రతిభావంతమైన స్థానాల్లో ఉన్న దేశాలు మార్పు కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రతిఘటిస్తున్నారు. ఐరాస భద్రతా మండలిలో దీన్ని మనం ఎక్కువగా చూడవచ్చు’ అని చెప్పారు.