– గోర్ బంజారా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్
కళల్ని క్రీడాకారులను ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించడం ద్వారా సమాజం ఎప్పుడు కూడా ఐక్యమత్యంతో ఉండే అవకాశం ఉంది ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటానని శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రి నిజామాబాద్ డాక్టర్ హరికృష్ణ అన్నారు. గోర్ బంజారా మాస్టర్స్ బ్యాట్మెంటన్ టోర్నీ నిర్వహణ అభినందనీయమని అన్నారు. కళలను, క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించడంతోపాటు సమాజం ఐక్యమత్యంతో ఉండేలా నిర్వహించిన కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆఫీసర్స్ క్లబ్ లో నిర్వహించిన గోర్ బంజారా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆయన పాల్గొన్నారు. మూడు రోజులపాటు టోర్నీ నిర్వహణకు కృషి చేసిన ఉపాధ్యాయుడు ప్రకాశ్, ఏవో గంగారాం, వైద్యారోగ్యశాధికారి ప్రతాప్ సింగ్, దేవిసింగ్ కు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మొట్టమొదటిసారి బంజారా స్పోర్ట్స్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో గోర్ బంజారా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు హరికృష్ణతోపాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాను సన్మానించారు.