– కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట రాజుగౌడ్
నవతెలవంగాణ-శంకర్‌పల్లి
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట రాజుగౌడ్ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పామేన భీమ్ భరత్ సమక్షంలో శంకర్‌పల్లి మండలంలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన 30 మంది కార్యకర్తలు శనివారం రాజగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి వారికి కాంగ్రెస్ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలం దరూ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని కోరారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎలాం టి అభివృద్ధి చేయలేదన్నారు. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటా రాజుగౌడ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతల మయంగా ఉన్నాయన్నారు. శంకర్ పల్లి మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను నగరంలోని యాకత్పురా కార్వాన్‌లోని ప్రజలకు ఇండ్లు ఇవ్వడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. అర్హులైన లబ్దిదారులు శంకర్ పల్లి మండలంలో లేరా అని నిలదీశారు. మన మండలంలో నిర్మిం చిన ఇండ్లను, నగరంలోని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఏమి టని, ఇది ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లో లోపాయుక్త ఒప్పందంగా ఉంద న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందనీ, అందరికీ అభివృద్ధి పథకాలు అందుతాయని హామీనిచ్చారు. ప్రజలందరూ కాంగ్రెస్ చేయ్యి గుర్తుకే ఓటేసి, అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు నర్సింహ యాదవ్, కృష్ణ, ఉమేష్, గురువు, లక్ష్మణ్, రాఘవేందర్, సునీల్, 30 మంది మహిళలు తదితరులు ఉన్నారు.