రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం స్పష్టమైనా

– పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్ :
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములతో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి స్పష్టం చేశారు. ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని వెలికట్ట, నాంచారి మడూరు గ్రామాల్లో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ఎస్టీ సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్ ఆధ్వర్యంలో వెలికట్ట గ్రామానికి చెందిన బీఆర్ఎస్‌ సీనియర్ నాయకులు వడ్లకొండ వెంకట సాయిలు, బందు వెంకన్న, భోగ కమలాకర్, బంధు జంపన్న, సారన్న, బొచ్చు వెంకన్న లతో పాటు ఆయా పార్టీలకు చెందిన 300 మంది నాయకులు ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దయాకర్ రావుకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒకే వ్యక్తికి మూడు పర్యాయాలు అవకాశం ఇస్తే అధికార దుర్వినియోగం జరుగుతుందని, మంత్రి ఎర్రబెల్లి ఆగడాలను ప్రశ్నిస్తే సామాన్యులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు నేటికీ పాలకుర్తి నియోజకవర్గంలో కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. ఆ మాట నిలబెట్టుకుందన్నారు. ఇప్పుడు తెలంగాణకు ఇచ్చే గ్యారంటీలన్నింటినీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ మంత్రివర్గం కొలువుదీరిన రోజు నుంచే అమల్లోకి తెస్తామన్నారు. నూతనోత్తేజంతో, స్పష్టమైనా సందేశంతో వెళదామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైందని, రైతుల కోసం వరంగల్‌, యువత కోసం హైదరాబాద్‌, వృద్ధుల కోసం ఖమ్మంలో డిక్లరేషన్లు చేసిందని గుర్తుచేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములతో పార్టీపై ప్రజల్లో అచంచల విశ్వాసం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఏసిఎస్ చైర్మన్ కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ హామ్య నాయక్, మండల అధ్యక్షులు సుంచు సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉష, మహిళా మండల అధ్యక్షురాలు ప్రశాంతి, మహిళా మండల నాయకురాలు మాలోతు సునీత రాజేందర్, నాయకులు ఇమ్మడి శ్రీనివాస్, శ్యామకూరి సోమయ్య, కొమ్ము శ్రీనివాస్, జితేందర్ రెడ్డి, భాస్కర్ రాజు, దీకొండ మధు గౌడ్, పబ్బాల రాము, వాంకుడోత్ లాక్యా నాయక్, కనుకుంట్ల కుమార్, వడ్లకొండ కుమార్, నరేందర్ రెడ్డి, ధీకొండ సరిత, కుమార్,సంజీవ, తదితరులు పాల్గొన్నారు.