నవతెలంగాణ- నెల్లికుదురు
యువత స్వయం శక్తితో ఏదో ఒక ఉపాధి నేర్చుకొని ఎదగడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు అన్నారు మండల కేంద్రంలో తొర్రూర్ కేసముద్రం నెల్లికుదురు ఎక్స్ రోడ్డు వద్ద ఓరుగల్లు బిర్యాని సెంటర్ ను మంగళవారం ప్రారంభించిన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని నేడు యువకులు చిరు వ్యాపారాలు ఎంచుకొని సన్మార్గంలో నడవడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి యువకులను గ్రామస్తులు అభినందిస్తున్నారని అన్నారు యువకులు ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఇందులో అన్ని రకాల బిరియాని లభించునని తెలిపారు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రోప్రైటర్ మచ్చ కిరణ్ నాయకులు, రత్నపురం యాకయ్య, మౌనేందర్, గడ్డం అరుణ్ కుమార్, ఆకుల నరసయ్య, అరుణ, రవి షటిల్, ఆర్కే మద్ది రాజేష్, క్రాంతి రెడ్డి, వరి పెళ్లి ఉప్పలయ్య, మచ్చ యాకయ్య, పెరుమాండ్ల, సమరం తదితరులు పాల్గొన్నారు.