
– అండర్-13 ఖేలో ఇండియా ఫుట్బాల్ టోర్నీ విజేత డెక్కన్ డైనమాస్ జట్టు
– జిల్లా కేర్ ఫుట్బాల్ అకాడమీ జట్టు
నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా మహిళా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని జిల్లా సునీత కుంచాల అన్నారు. కే లో ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని ఉమెన్స్ కాలేజ్ మైదానంలో అండర్ 13 ఖలో ఇండియా బాలికల టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల విచ్చేసి ఉమెన్స్ కళాశాల ఎన్సిసి క్యాడేట్స్ గౌరవ వందనం స్వీకరించి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా నుండి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి యెండల సౌందర్య, ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, బాక్సింగ్లో నిఖత్ జరీన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ లను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలతోపాటు చదువు లో సైతం రాణించాలని కోరారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మహిళా క్రీడాకారులు ఆత్మ రక్షణ కోసం జూడో కరాటే లాంటి క్రీడల్లో సైతం తర్ఫిదును పొందాలని తెలియజేశారు. అంతర్జాతీయ క్రీడాకారులను శిక్షణ ఇస్తున్న కేర్ ఫుట్బాల్ అకాడమీ చైర్మన్ నరాల సుధాకర్ , కోచ్ గొట్టపాటి నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులనుదేశిస్తూ రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి జి ఫాల్గుణ మాట్లాడుతూ అంతర్జాతీయ బ్రెజిల్ ఫుట్బాల్ లీగ్ లో ఉమ్మడి రాష్ట్రాల లో మొదటి మహిళా క్రీడాకారినిగా గూగుల్ సౌమ్య ఆడుతుందని కొనియాడారు. అంతర్జాతీయ ఐడల్ ఫుట్బాల్ టోర్నీలలో తెలంగాణ నుండి 9 మంది క్రీడాకారులు ఆడడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ ఫుట్బాల్ కార్యదర్శిగా తలెత్తుకు తిరుగుతున్న అంటే మహిళా క్రీడాకారులే అని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుట్బాల్ రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షులు మంతెన రాజేందర్ రెడ్డి, డాక్టర్ కవిత రెడ్డి లు మాట్లాడుతూ హలో ఇండియా క్రీడా పోర్టులను జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని కే లో ఇండియా తరఫున అండర్ 13 అండర్ 15 అండర్ 17 క్రీడాకారులను ఎంపిక చేసి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులు ఒక గోల్ ని ఎంచుకొని నిరంతరం మైదానంలో శిక్షణ తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ టోర్నమెంట్ కు మైదానాన్ని కల్పించిన ఉమెన్స్ కళాశాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చలో ఇండియా అండర్ 13 టోర్నీ విజేతగా డెక్కన్ డైన మస్ జట్టు, రనారఫ్ జట్టుగా జిల్లా కేర్ ఫుట్బాల్ అకాడమీ లు నిలిచాయి. విజేత జట్టుకు 30,000 వేల నగదు రన్నర్ అఫ్ జట్టుకు 20వేల నగదు , ట్రోఫీ మెడల్స్ లను ముఖ్యఅతిథి జిల్లా సునీత కుంచాల చేతుల మీదుగా అందజేశారు. టోర్నీ బెస్ట్ గోల్ కీపర్ గా అక్షర ఫుట్బాల్ క్లబ్ , బెస్ట్ డిఫెండర్ ఇషిత హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్, రోహిత రెడ్డి బెస్ట్ మీడ్ ఫీల్డర్ డెక్కన్ డైనమస్, ఎమర్జింగ్ ప్లేయర్స్ గా కీర్తన , ఫాతిమా లు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి జి ఫాల్గుణ, రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షులు మంతెన రాజేందర్ రెడ్డి, డాక్టర్ కవిత రెడ్డి జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఫరూఖ్, జావిద్,తెలంగాణ ఫుట్బాల్ అకాడమీ జాయింట్ సెక్రెటరీ కేకే రెడ్డి, ఫరూక్ , మహిళా కళాశాల సెక్రెటరీ పద్మనాభ రెడ్డి , మహిళా కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు మహేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ భారతీ రెడ్డి, వివిధ అకాడమీలా కోచ్లు హరి, విజయ్, ఆదర్శ్, వినోద్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.