– సర్టిఫికెట్లు అందజేతలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి..
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మండలంలోని చిన్నతడుగూరు గ్రామ యువకులు తుకారం నిమ్మలవార్, బాలాజీ కవట్వార్ లతో పాటు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని రక్త దాన సర్టిఫికెట్లు అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌలవార్ హనుమాన్లు స్వామి అన్నారు. నరేంద్ర మహారాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ రక్తదానాన్ని హైదరాబాదులోని నిలోఫర్ ఆస్పత్రి సిబ్బంది సేకరించారు.